ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం

ABN, First Publish Date - 2021-11-21T07:41:59+05:30

ర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ యుద్ధనౌకను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదివారం జలప్రవేశం చేయించనున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు జలప్రవేశం చేయనున్న 

జాతికి అంకితమివ్వనున్న 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

నేడు జలప్రవేశం చేయనున్న 

‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’


విశాఖపట్నం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ యుద్ధనౌకను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదివారం జలప్రవేశం చేయించనున్నారు. అనంతరం ఆయన దీనిని జాతికి అంకితమిస్తారు. ముంబైలోని మజగాన్‌ నౌకాదళ కేంద్రంలో రూపుదిద్దుకున్న ఈ యుద్ధనౌకకు 2015 ఏప్రిల్‌ 20న ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ అని పేరు పెట్టారు. గత నెల 29న నౌకాదళం చేతికి ఈ నౌక అందింది. ప్రాజెక్టు 15బీలో నిర్మిస్తున్న నాలుగు నౌకల్లో ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం మొదటిది. శత్రుదేశాల క్షిపణులను రహస్యంగా మట్టుబెట్టగలిగే ఈ నౌక పొడవు 163 మీటర్లు. వెడల్పు 17 మీటర్లు. బరువు 7,400 టన్నులు. ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గాలిలోకి ఆయుధాలను ప్రయోగించే సామ ర్థ్యం ఈ నౌక సొంతం. నిఘా రాడార్‌ ఇందులో మరో ప్రత్యేకత. సబ్‌మెరైన్లను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించే రాకెట్‌ లాంచర్లు, టార్పెడో లాంచర్లు, మల్టీ రోల్‌ హెలికాప్టర్లు దీనిలో ఏర్పాటు చేశారు. అణు, జీవ రసాయన యుద్ధ వాతావరణాల్లోను ఇది పనిచేయగలదు. 

Updated Date - 2021-11-21T07:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising