ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ గుర్తింపును రద్దుచేయండి

ABN, First Publish Date - 2021-10-29T09:50:36+05:30

టీడీపీ గుర్తింపును రద్దుచేయండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికల సంఘానికి వైసీపీ విజ్ఞప్తి  

న్యూఢిల్లీ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సుశీల్‌చంద్రను వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్‌, టీ.రంగయ్య, సంజీవ్‌కుమార్‌, ఎన్‌.రెడ్డప్ప, జి.మాధవి కలసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ, అసభ్యకరమైన భాష మాట్లాడుతూ ప్రజల మెదళ్లను విషతుల్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ముఖ్యమంత్రిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రమైన అసభ్య పదజాలం వాడారని, అయినా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించలేదని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు, గంజాయికి ఏపీ హబ్‌గా మారిందంటూ రాష్ట్ర ప్రతిష్ఠను టీడీపీ నేతలు నాశనం చేస్తున్నారని వివరించారు. టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, లోకేశ్‌, బొండా ఉమా బూతులు మాట్లాడారని, అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావు సీఎంను గంజాయి ముఖ్యమంత్రి అని సంబోధించారని తెలిపారు. అందువల్ల టీడీపీ గుర్తింపును రద్దుచేసి ప్రజాస్వామ్య విలువల పరిరక్షించాలని ఈసీని వైసీపీ ఎంపీలు అభ్యర్థించారు. 

Updated Date - 2021-10-29T09:50:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising