ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయనగరం విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-10-17T08:57:01+05:30

విజయనగరం విద్యార్థుల ప్రతిభ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌(విజయనగరం), అక్టోబరు 16: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో విజయనగరం జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. అనేకమంది ఉత్తమ ర్యాంకులు సాధించారు. జిల్లా కేంద్రంలోని పైడిమాంబ కాలనీకి  చెందిన మిడతాన ప్రణయ్‌కు ఓపెన్‌ కేటగిరిలో 56వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 3వ ర్యాంకు సాధించారు. జిల్లా కేంద్రానికే చెందిన కె.ప్రణీత్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో 73వ ర్యాంకు సాధించగా, కనకల డిట్టూ ఆకాంక్షకు ఓపెన్‌లో 274, ఓబీసీ కేటగిరీలో 28వ ర్యాంకు వచ్చింది. 


సత్తా చాటిన సిక్కోలు 

రేగిడి/పోలాకి/రాజాం రూరల్‌/జలుమూరు, అక్టోబరు 16: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాజాం పట్టణానికి చెందిన వారాడ మహంతినాయుడు ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 38వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో రెండో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. మల్లికార్జున కాలనీకి చెందిన వానపల్లి రాజగోపాల్‌ ఓపెన్‌ కేటగిరీలో 375వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 39వ ర్యాంకు సాధించాడు. రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన వావిలపల్లి బాలాజీ సిద్ధార్థ ఆలిండియా స్థాయిలో 126 ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో పదో ర్యాంకు సాధించాడు. పోలాకి గ్రామానికి చెందిన ఇంజరాపు నిఖిల్‌ ఆలిండియాలో 196వ ర్యాంక్‌, ఓబీసీ కేటగిరీలో 16వ ర్యాంక్‌ సాధించాడు. జలుమూరు మండలం చల్లవానిపేట గ్రామానికి చెందిన పాగోటి హేమంత్‌నాయుడు 262 మార్కులతో జాతీయ స్థాయిలో 232వ ర్యాంకు సాధించాడు. ఓబీసీలో 22వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. 

Updated Date - 2021-10-17T08:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising