ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల భూములను ఎమ్మెల్యేలే కబ్జా చేస్తున్నారు

ABN, First Publish Date - 2021-10-17T08:42:09+05:30

పేదల భూములను ఎమ్మెల్యేలే కబ్జా చేస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్సీ, ఎస్టీ ల్యాండ్‌కూ రక్షణ లేదు

సీఎం, మంత్రులు, సీఎస్‌ ఉండగా సజ్జల ఎవరు మాట్లాడడానికి?

మితిమీరిన సంక్షేమ నష్టం : మాజీ మంత్రి డీఎల్‌


కడప/ఖాజీపేట, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘పేదల భూములను ఎమ్మెల్యేలే బెదిరించి రాయించుకుంటున్నారు. దీనికి పోలీసులను, రెవెన్యూను ఉపయోగించుకుంటున్నారు.  కొందరు ఎమ్మెల్యేలు జేబుల్లో డబ్బును లాక్కొనే పరిస్థితికి వచ్చారు. దువ్వూరులో మా ఎమ్మెల్యే రూ.80 లక్షల విలువ చేసే రెండు ఎకరాల భూమి రాయించుకున్నారు. ఎస్సీ, ఎస్టీల భూములను లాక్కుంటున్నారు. రాష్ట్రం మరో 20-25 ఏళ్లు కోలుకోలేదు. రాబోయే ఆదాయాన్ని, భూములను తాకట్టుపెట్టారు. డబ్బులు కట్టకపోతే వేలం వేస్తారు. నవరత్నాలు రాష్ట్ర ఖజానాను, రాష్ట్రాన్ని కొల్లగొడతాయనుకోలేదు. మితిమీరిన సంక్షేమం నష్టం’’ అని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌’తో మాట్లాడారు. ‘‘మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కి మద్దతుగా ఇక నుంచి ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు చేసే పనులన్నింటినీ బయటపెట్టాలని నిర్ణయించుకున్నా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, 30 మంది మంత్రులు, చీఫ్‌ సెక్రటరీ ఉన్నారు. అసలు వెన్నెముక లేని మంత్రులు ఎందుకు? ఎంపీ రఘురామకృష్ణ చెప్పినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ఉన్నారు’’ అని ఎద్దేవా చేశారు. ఉండవల్లి చేసిన ఆరోపణలపై సీఎం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు వెన్నెముక లేని వారిగా తయారయ్యారని మండిపడ్డారు. 


Updated Date - 2021-10-17T08:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising