ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ట్రాన్స్‌కో పనితీరు బాగుంది!

ABN, First Publish Date - 2021-06-14T09:02:45+05:30

విద్యుత్‌ నెట్‌వర్క్‌ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తూ ఏపీ ట్రాన్స్‌కో మ్యాపింగ్‌ చేసిన తీరును దక్షిణాది విద్యుత్‌ గ్రిడ్‌ ప్రశంసించింది. ఇదే నమూనాను మొత్తం దక్షిణాది అంతా అమలు చేయాలని గ్రిడ్‌ నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం విద్యుత్‌ నెట్‌వర్క్‌ను ట్రాన్స్‌కో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెట్‌వర్క్‌ మ్యాపింగ్‌పై దక్షిణాది గ్రిడ్‌ ప్రశంస

దక్షిణాదిలో ఇదే నమూనా అమలుకు నిర్ణయం


అమరావతి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ నెట్‌వర్క్‌ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తూ ఏపీ ట్రాన్స్‌కో మ్యాపింగ్‌ చేసిన తీరును దక్షిణాది విద్యుత్‌ గ్రిడ్‌ ప్రశంసించింది. ఇదే నమూనాను మొత్తం దక్షిణాది అంతా అమలు చేయాలని గ్రిడ్‌ నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం విద్యుత్‌ నెట్‌వర్క్‌ను ట్రాన్స్‌కో జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ వ్యవస్థలోకి తెచ్చింది. గత ఫిబ్రవరిలో దీనిని అమల్లోకి తెచ్చారు. దీనివల్ల సరఫరా, పంపిణీ లైన్లు, ట్రాన్స్‌కో.. డిస్కంలకు చెందిన టవర్లు, స్తంభాలు, వాటి భౌతిక పరిస్ధితి అంతా రియల్‌ టైం వ్యవస్ధలో చేరినట్టయింది. ఈ ఆస్తులన్నింటినీ జియో ట్యాగింగ్‌  చేశారు. విద్యుత్‌ లైన్ల ఓవర్‌, అండర్‌ లోడింగ్‌, విద్యుత్‌ ఆస్తుల సరిహద్దులు, ఖాళీ స్ధలాలను కూడా దీని ద్వారా తెలుసుకొనే వీలుంది. ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత ప్రాంతాలను, విద్యుత్‌ ఆస్తులను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఈ వ్యవస్ధ బాగా ఉపకరిస్తోంది. ఈ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, అందరూ దీని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని ట్రాన్స్‌కో సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ నమూనాను మొత్తం దక్షిణాది అంతా అమలు చేయాలని దక్షిణాది గ్రిడ్‌ నిర్ణయించింది. రాష్ట్రాల మధ్య విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని తమకు పంపాలని అన్ని దక్షిణాది రాష్ట్రాలను గ్రిడ్‌ కోరింది.

Updated Date - 2021-06-14T09:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising