నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన ఆదేశాలు
ABN, First Publish Date - 2021-02-17T03:08:46+05:30
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపుల కారణంగా...
అమరావతి: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపుల కారణంగా నామినేషన్ వేయనివారికి తిరిగి అవకాశం కల్పించారు. గుంటూరులోని మాచర్ల, కడపలోని పులివెందుల, రాయచోటి, చిత్తూరులోని పుంగనూరు, పలమనేరు, తిరుపతి నగర పాలక సంస్థలో సింగిల్ నామినేషన్లపై అధికారులను రమేశ్ కుమార్ నివేదిక కోరారు. ఈనెల 20 లోపు పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బెదిరిస్తున్నారని రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఆ వార్డుల్లో నామినేషన్లు తీసుకోవాలని సూచించారు. బెదిరింపులపై మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. ఆయా రాజకీయపక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రమేశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Updated Date - 2021-02-17T03:08:46+05:30 IST