ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీవీకి కౌంటర్ ఇచ్చిన ఏపీ పోలీస్

ABN, First Publish Date - 2021-04-18T20:34:59+05:30

డీజీపీ, ఇతర పోలీసు అధికారులు, వివేకా హత్య విషయంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: డీజీపీ, ఇతర పోలీసు అధికారులు, వివేకా హత్య విషయంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లేఖపై తాజాగా పోలీస్ శాఖ స్పందించింది. ఈమేరకు లేఖ విడుదల చేసింది. వివేకా హత్య కేసులో ఆధారాల్లేకున్నా.. జగన్ కుటుంబ సభ్యులు, బంధువులను అరెస్ట్ చేయాలని ఏబీ ఒత్తిడి చేశారంటూ తీవ్ర అభియోగాలు మోపింది. కృత్రిమ డాక్యుమెంట్ల సృష్టి అంటూ డీజీపీపై ఏబీ నిరాధార ఆరోపణలు చేశారని కౌంటర్ ఇచ్చారు. నాడు వైఎస్ వివేకా హత్య దర్యాప్తు అంతా ఏబీ వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే జరిగిందని, ఏబీవీ ఇచ్చిన సమాచారంతోనే నాడు చంద్రబాబు ప్రతి రోజూ మీడియాతో మాట్లాడేవారన్నారు. 


‘‘తన వద్దనున్న కీలక సమాచారాన్ని నాడే ఏబీ వెంకటేశ్వరరావు సిట్‌కు ఎందుకు అందివ్వలేదన్నారు? దర్యాప్తు విషయాన్ని పక్కన పెట్టి జగన్ కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్టు చేయాలని ఒత్తిడి తెచ్చారా..? లేదా..? నాడు దర్యాప్తు అధికారి రాహూల్ దేవ్ శర్మపై ఏబీవీ ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం కాదా..? రాహూల్ దేవ్ శర్మ నిబద్ధతగల అధికారి కాబట్టి ఏబీవీ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. వివేకా హత్య కేసు విషయంలో తన వద్దనున్న దర్యాప్తు సమాచారాన్ని ఏబీవీ అందివ్వకపోవడం తప్పు కాదా..?కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలను మీడియాలో బయట పెట్టడం సమంజసం కాదు. కృత్రిమ డాక్యమెంట్లు సృష్టించారన్న ఏబీ ఆరోపణలు నిరాధారమైనవి. సహచర అధికారులపై ఏబీ ఆరోపణలు గుప్పించడం సరికాదు. సర్వీస్ రూల్సుకు విరుద్ధంగా ఏబీవీ వ్యవహరించారు. డీజీ హోదాలో ఉన్న ఏబీవీ ఈ తరహాలో వ్యవహరించడం సరికాదు’’ అని లేఖలో టెక్నికల్ డీఐజీ పాల్ రాజు  పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-18T20:34:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising