ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ, ఎన్‌డీఏలో చేరాలి

ABN, First Publish Date - 2021-10-18T07:23:23+05:30

వైసీపీ, ఎన్‌డీఏలో చేరాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రానికి మేలు జరుగుతుంది

పార్లమెంటులో జగన్‌ పార్టీ ఎంపీలు కేంద్రానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు

కేంద్ర మంత్రి రాందాస్‌ అథావలే


విశాఖపట్నం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏలో చేరాలి. అది జరిగితే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇరిగేషన్‌, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భారీగా నిధులు వస్తాయి’’ అని కేంద్ర మంత్రి రాందాస్‌ అథావలే అన్నారు. ఆదివారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లో వివిధ అంశాలపై జరుగుతున్న చర్చల్లో వైసీపీ ఎంపీలు కేంద్రానికి అనుకూలంగా మాట్లాడుతూ, సహకారం అందిస్తున్నారని తెలిపారు. ‘‘వైఎస్‌ జగన్‌ నాకు మిత్రుడు. కేంద్రంలో చేరతానని చెబితే నేనే స్వయంగా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసి మాట్లాడతా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్‌ వర్గాలకు నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం నాకూ ఉంది. అయితే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేశాం. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ అనేది పీవీ ప్రధానిగా వున్నప్పుడే ఆరంభమైంది’’ అని గుర్తుచేశారు. ఏపీలో మూడు రాజధానుల అంశం రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిది పేర్కొన్నారు. ఏపీలో కులాలతో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబానికి 5 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్న అగ్రవర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. 

Updated Date - 2021-10-18T07:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising