ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేక్‌... నాటకాలు!

ABN, First Publish Date - 2021-09-16T08:02:03+05:30

అక్రమాలు, అవినీతి... అంటూ పాత విషయాలు తవ్వి తీయాలి. ఏది ఏమైనా, ఎలాగైనా పాత ప్రభుత్వంలో పని చేసిన వారిపై కేసులు పెట్టి వేధించాలి! ఇది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేని తప్పు నిరూపించడమే లక్ష్యం

అవినీతి అంటూ ఫైబర్‌నెట్‌పై గురి

టెరాసాఫ్ట్‌పై కేసు పెట్టిన సీఐడీ

నాడు ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన సిగ్నం

అది ‘ఫేక్‌’ అంటూ ఇప్పుడు కొత్త కథ

వైసీపీ రాగానే సిగ్నం సీఈవోకు పదవి

ఫైబర్‌నెట్‌లో ఈడీగా గౌరీశంకర్‌కు పోస్టు

‘సడలింపులు’ ఇచ్చి మరీ పెద్ద కొలువు

డిగ్రీ సర్టిఫికెట్‌లు ఫేక్‌ అని తేలడంతో ఉద్వాసన

కేసు పెట్టి అరెస్టు చేయకుండా వదిలేసి

ఇప్పుడు ఫైబర్‌నెట్‌ కేసులో వాడుకున్న వైనం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అక్రమాలు, అవినీతి... అంటూ పాత విషయాలు తవ్వి తీయాలి. ఏది ఏమైనా, ఎలాగైనా పాత ప్రభుత్వంలో పని చేసిన వారిపై కేసులు పెట్టి వేధించాలి! ఇది... అధికారంలోకి వచ్చిన రోజు నుంచే వైసీపీ సర్కారు లక్ష్యం! ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు తొలి దశ టెండర్లలో ‘అవినీతి’ అంటూ సీఐడీ నమోదు చేసిన కేసు కూడా ఇందులో భాగమే అనే అనుమానం బలపడుతోంది. ఇందుకు గౌరీ శంకర్‌ అనే వ్యక్తిని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇంటింటికి ఇంటర్‌నెట్‌, టీవీ, టెలీఫోన్‌ ప్రసారాలు తక్కువ ధరకే అందించేందుకు టీడీపీ సర్కారు ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టును చేపట్టింది. టెరాసాఫ్ట్‌ అనే సంస్థ ఒకరకంగా చెప్పాలంటే... ఆయన ఒక ఫేక్‌! ఫేక్‌ సర్టిఫికెట్లతో సర్కారు పదవిలో కూర్చున్నాడు! అంతకుముందు తాను ఒక కంపెనీకి ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ ఇచ్చానని ఇప్పుడు చెబుతున్నాడు.  ‘ఫేక్‌’ మాటల చుట్టూ కథ నడిపిన సర్కారు ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుపైన  ‘ఫేక్‌’ అవినీతి ముద్ర వేసి... సీఐడీ కేసు కూడా పెట్టింది. ఈ ‘ఫేక్‌’ కథేమిటో మీరూ చూడండి! ఇందులో భాగస్వామి. ఈ సంస్థ తమకు పంపిణీదారు అని... డిజిటల్‌ హై ఎండ్‌  పరికరాల సరఫరా, సేవల్లో అనుభవం ఉందని సిగ్నం అనే కంపెనీ ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ను టెరాసాఫ్ట్‌ చూపించింది. సిగ్నం కంపెనీ సీఈవో... గౌరీ శంకర్‌. ఇదంతా అప్పుడు జరిగిన సంగతి!


ఎన్నికల తర్వాత.... తన అజెండాలో భాగంగా ఫైబర్‌నెట్‌పైనా వైసీపీ సర్కారు గురిపెట్టింది. గౌరీ శంకర్‌ను మచ్చిక చేసుకుని... ఆయన ద్వారానే పావులు కదపాలని భావించింది. ఆయనకు పిలిచి పదవి ఇచ్చింది. 


ఇలా మంచి చేసుకుని... 

ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో బిజినెస్‌ కేటగిరీలో ఒక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నియామకం కోసం... వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ఒక నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇలాంటి ప్రాజెక్టు ఈడీ హోదాలో బాధ్యతలు నిర్వహించాలంటే ఉన్నత విద్యార్హతలు, సాంకేతిక అనుభవం ఉండాలి. కానీ... ఈ పదవి గౌరీశంకర్‌కు దక్కేలా అనేక సడలింపులు ఇచ్చారు. ‘ఏదైనా డిగ్రీ చేసి ఉంటే చాలు’ అని చెప్పారు. ఈడీ పదవి కోసం 137 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంబీఏ నుంచి పీహెచ్‌డీ వరకు పూర్తి చేసిన అనేక మంది టెక్‌ నిపుణులు ఉన్నారు. కానీ... అత్యంత చిత్రంగా బీఎస్సీ కంప్యూటర్స్‌, అది కూడా డిస్టెన్స్‌ (దూర విద్య) విధానంలో పూర్తి చేసిన గౌరీశంకర్‌ను ఈ పదవి వరించింది. టెక్నాలజీ, వ్యాపారంలో విశేషమైన గొప్ప అనుభవం ఉన్నందున ఆయన్నే తీసుకుంటున్నామని నోట్‌ఫైల్‌లో రాశారు. సీఎం జగన్‌ ఈ ఫైలును 2020, ఫిబ్రరిలో ఆమోదించారు. అదే ఏడాది మార్చి 13న ఆయన్ను ఫైబర్‌నెట్‌ ఈడీగా నియమిస్తూ ప్రభుత్వం జీఓ 66ను జారీ చేసింది.

 

హైటెక్‌ ఫేక్‌...

ఈడీ పోస్టుకు ఎంపికైన తర్వాత గౌరీశంకర్‌ తన విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు, ఇతర ధ్రువీకరణలను ప్రభుత్వానికి సమర్పించారు. ఇంటర్వ్యూకు ముందు ప్రొఫైల్‌లో పేర్కొన్న అంశాలకు, సర్టిఫికెట్లకు ఏమాత్రం పొంతన కుదరలేదు. ఈ తప్పుడు సంగతులు బయటపడితే రచ్చ అవుతుందనే ఉద్దేశంతో... ఫైబర్‌నెట్‌ సంస్థ త్రిసభ్య కమిటీతో విచారణ చేయించింది. తాను 2008-11 మధ్య యూపీలోని డాక్టర్‌ భీమ్‌రావు అంబేద్కర్‌  యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిరోజాబాద్‌లోని  ఎస్‌ఆర్‌కే కాలేజీలో చదివినట్లు గౌరీ శంకర్‌ తన ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. సర్టిఫికెట్‌లో మాత్రం సెయింట్‌జాన్‌ కాలేజీలో చదివినట్లుగా ఉంది. దీంతో... అంబేద్కర్‌ యూనివర్సిటీని సంప్రదించగా ఆయన సమర్పించింది ఫేక్‌ (బోగస్‌) సర్టిఫికెట్‌ అని తేలింది. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా, మూడో కంటికి తెలియకుండానే అతన్ని ఇంటికి సాగనంపారు. 


కేసు పెట్టకుండా... మళ్లీ ‘మచ్చిక’

తప్పుడు సర్టిఫికెట్లతో ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు గౌరీ శంకర్‌పై సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెట్టాలి. అరెస్టు చేసి జైలుకు పంపాలి. కానీ... అలా చేయలేదు. ఎందుకంటే... మొదట పదవి ఇచ్చి మచ్చిక చేసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత... అతనిపై ‘ఫేక్‌ సర్టిఫికెట్ల’ అస్త్రాన్నే ప్రయోగించారు. చెప్పినట్లు వినకపోతే కేసులు పెట్టడం ఖాయమని బెదిరించారు. ఇందులో భాగంగానే టెరాసాఫ్ట్‌ కంపెనీకి తాను ఇచ్చిన సర్టిఫికెట్‌ ఫేక్‌ అని, తనను బెదిరించి ఈ సర్టిఫికెట్‌ ఇప్పించుకున్నారని గౌరీ శంకర్‌ సీఐడీకి చెప్పినట్లు తెలుస్తోంది. 


ఫేక్‌ డ్రామా... 

‘‘మీకు హైఎండ్‌ డిజిటల్‌ టెక్నాలజీని అందించిందని సర్టిఫికెట్‌  ఇవ్వాలి. లేకుంటే నిన్ను వ్యాపారం చేసుకోనివ్వం’’ అని టెరాసా్‌ఫ్టకు చెందిన వేమూరి హరిప్రసాద్‌ బెదిరించారని, అందుకే తాను సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి వచ్చిందని గౌరీశంకర్‌ బుద్ధిమంతుడిలా సీఐడీకి చెప్పినట్లు జగన్‌ పత్రిక ఒక కథనం ప్రచురించింది. కానీ... అదే గౌరీశంకర్‌కు  జగన్‌ ప్రభుత్వం పిలిచి పదవి ఇచ్చిందని, ఆయన ఫేక్‌ డిగ్రీ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిశాక పక్కకు తప్పించిందని మాత్రం బయటపెట్టలేదు. నిజానికి... సిగ్నం ఇచ్చిన సర్టిఫికెట్‌పై అప్పుడే ప్రభుత్వం మరోసారి ఆరా తీసింది. అది నిజమైనదే అని, తామే జారీ చేశామని గౌరీ శంకర్‌ అప్పట్లో ధ్రువీకరించారు. దీనిపై సర్కారుకు లేఖ రాశారు. 


నిజంగా బెదిరింపులు వచ్చి ఉంటే... ఇలా రాయాల్సిన అవసరం ఏమిటి? ప్రభుత్వ పెద్దలకు ఎందుకు చెప్పలేదు? అప్పుడు నోరెత్తకుండా... ఇప్పుడు ‘ఫేక్‌’ మాటలు చెప్పడాన్ని బట్టి చూస్తే... ఆయన ఇంకెవరి దర్శకత్వంలోనూ నటిస్తున్నట్లు అర్థమవుతుంది. అన్నింటికంటే మించి... గౌరీశంకర్‌  ఫేక్‌. కానీ, ఆయనకు చెందిన సిగ్నం సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాట నిజం! వారికి టెరాసాఫ్ట్‌ కంపెనీ పంపిణీదారుగా ఉండటమూ నిజం! అప్పట్లో సర్టిఫికెట్‌ జారీ చేసిన తర్వాత రెండు సంస్థల మధ్య పలులావాదేవీలు జరగడమే దీనికి నిదర్శనం! ఇప్పుడు చెప్పండి? ఎవరు ఫేక్‌? ఏది ఫేక్‌?


టెరాసాఫ్ట్‌ సంస్థ అప్పట్లో తనను బెదిరించి మరీ ‘ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌’ ఇప్పించుకుందని గౌరీశంకర్‌ సీఐడీకి చెప్పినట్లుగా జగన్‌ పత్రిక ఒక కథనం రాసింది. అయితే... ఇదే గౌరీశంకర్‌కు జగన్‌ సర్కారు ఫైబర్‌నెట్‌లో పదవి ఇచ్చి, ఆ తర్వాత అతను తన విద్యార్హతకు సంబంధించి ‘ఫేక్‌ సర్టిఫికెట్లు’ ఇచ్చినట్లు తేలడంతో తప్పనిసరై తొలగించిన విషయాన్ని మాత్రం దాచిపెట్టింది.


గౌరీశంకర్‌కు చెందిన సిగ్నం సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుండటం నిజం. టెరాసా్‌ఫ్టకు, సిగ్నంకు మధ్య వ్యాపార లావాదేవీలు జరగడమూ నిజం. మరి... అప్పుడు ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ ఎందుకు ‘ఫేక్‌’ అవుతుంది?

Updated Date - 2021-09-16T08:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising