ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ‌ఫ్రం హోం ఇవ్వాలి: బొప్పరాజు

ABN, First Publish Date - 2021-04-20T00:02:45+05:30

ఏపీలో కరోనాకు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు బలవుతున్నారని ఏపీ జేఏసీ అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో రెండో విడత కరోనా విజృంభిస్తుడడంతో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు బలవుతున్నారని ఏపీ జేఏసీ అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీరావు తెలిపారు. సోమవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీరావు వినతిపత్రం అందజేశారు. తక్షణమే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం కల్పించాలని కోరారు. వైరస్ బారిన పడిన ఉద్యోగులకు 14 రోజుల క్వారంటైన్ సెలవులు ప్రకటించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల శుభ్రత, కరోనా ప్రోటోకాల్ పాటించేందుకు తక్షణమే సరిపడా నిధులు మంజూరు చేయాలన్నారు. 


రాష్ట్రంలో కరోన సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిందని.. పలువురు ఉద్యోగులు కరోన బారిన పడి చనిపోతున్నారని చెప్పారు. వేలాది మంది ఉద్యోగులు వైరస్ బారిన పడుతున్నారన్నారు. దీంతో ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. ఏపీలోని అన్నీ ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ ఒక్కొక్క ఆస్పత్రికి ఒక నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వానికి జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-04-20T00:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising