ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్: మాజీ మంత్రి అఖిల ప్రియ

ABN, First Publish Date - 2021-08-01T19:43:45+05:30

ఏపీలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్: మాజీ మంత్రి అఖిల ప్రియ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని మాజీమంత్రి భూమా అఖిల ప్రియ విమర్శించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని, ఆళ్లగడ్డ మండలం ఆర్ క్రిష్ణాపురంలో వైసీపీ నేతలు ఎర్రమట్టి దందా సాగిస్తున్నారని ఆమె ఆరోపించారు. పుల్లయ్య అనే వ్యక్తి పేరు మీద ఎకరాకు పర్మిషన్ తీసుకొని... మరికొన్ని ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వుతున్నారని అఖిల ప్రియ తెలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చెరువులను వైసీపీ నాయకులు కబ్జా చేసి మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకుంటున్నారని విమర్శించారు. మట్టి మాఫియా నుంచి ఎమ్మెల్యేకు వాటాలు, అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకొని అధికారులకు అప్పగిస్తే సీజ్ చేశారు. కానీ ఉదయం ఆ వాహనాలు వైసీపీ నాయకుడి ఇంట్లో ఉన్నాయి. వారంలో అధికారులు ఎర్రమట్టి దందాను అరికట్టాలి, లేకపోతే రైతులతో కేసులు పెట్టిస్తామని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు.

Updated Date - 2021-08-01T19:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising