ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ కొనుగోలుపై ఏపీ హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-12-20T21:14:13+05:30

సోలార్ పవర్ కార్పొరేషన్ నుంచి విద్యుత్ కొనుగోలుపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సోలార్ పవర్ కార్పొరేషన్ నుంచి విద్యుత్ కొనుగోలుపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. సోలార్ పవర్‌ను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ వేశారు. యూనిట్ రూ. 2.05 ఉన్న సోలార్ పవర్‌ను రూ. 2.45కు కొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. సెకీ ద్వారా ఏపీకి విద్యుత్ సరఫరాకు అదానీ సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఏపీలో యూనిట్ రూ. 2.05కే విద్యుత్ సరఫరా చేసేందుకు అనేక సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. వాటిని కాదని ఎక్కువ ధరతో కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఈ వాదనాలను పరిశీలించిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు అదానీ సంస్థ, సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఇంధన శాఖతో సహా మొత్తం పది మంది ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2021-12-20T21:14:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising