ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

ABN, First Publish Date - 2021-06-03T19:22:37+05:30

అమరావతి: అమరావతి: ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ నిర్వహించింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్‌ బ్లాక్‌ మార్కెట్‌పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతి: ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ నిర్వహించింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్‌ బ్లాక్‌ మార్కెట్‌పై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం సరిపడా ఇంజక్షన్లు సరఫరా చేయటం లేదని తెలిపింది. 1,400 మంది పేషేంట్స్‌కు 13 వేల ఇంజక్షన్లు మాత్రమే ఇచ్చారని ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో రోగికి రోజుకి 3 ఇంజక్షన్ల చొప్పున 15 రోజులు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. బ్లాక్ ఫంగస్ రోగుల కోసం 50 వేల ఇంజక్షన్లు అవసరం ఉందని వెల్లడించింది. ప్రైవేట్ ఫార్మా కంపెనీల నుంచి ప్రభుత్వం కొనుగోలుకి సిద్ధమైందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ‘ఏపీ అవసరాలకు సరిపడా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు? ఏ ప్రాతిపదికన రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు? కేంద్రం మధ్యాహ్నంలోగా సమాధానం చెప్పాలి’ అని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2021-06-03T19:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising