ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నామినేషన్లు వేసే అవకాశం కల్పించండి

ABN, First Publish Date - 2021-02-26T08:09:55+05:30

అనంతపురం జిల్లా, తాడిపత్రి మున్సిపాలిటీలోని పలు వార్డులకు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, కె.రంజిత్‌ కుమార్‌, ఎం.పెద్దన్న, సీహెచ్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, ఎన్‌.విష్ణువర్థన్‌ రెడ్డి హైకోర్టులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అభ్యర్థులపై గతేడాది అధికార పార్టీ దౌర్జన్యాలు
  • టీడీపీ తరఫు నామినేషన్లను లాక్కొని చించేశారు
  • పోలీసుల సమక్షంలోనే అభ్యర్థులను కిడ్నాప్‌ చేశారు
  • హైకోర్టులో జేసీ ప్రభాకర్‌రెడ్డి తదితరుల న్యాయవాదుల వాదన
  • వివరాలు సమర్పించాలని ఎస్‌ఈసీకి ధర్మాసనం ఆదేశం
  • విచారణ సోమవారానికి వాయిదా

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా, తాడిపత్రి మున్సిపాలిటీలోని పలు వార్డులకు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, కె.రంజిత్‌ కుమార్‌, ఎం.పెద్దన్న, సీహెచ్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, ఎన్‌.విష్ణువర్థన్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలు గురువారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ గతేడాది నామినేషన్ల సందర్భంగా అధికార పార్టీ వారు తీవ్ర దౌర్జన్యాలకు పాల్పడ్డారన్నారు. టీడీపీ తరఫున నామినేషన్లు వేయడానికి వెళ్లిన అభ్యర్థుల నుంచి నామినేషన్లను లాక్కొని చించేశారని తెలిపారు. పోలీసుల సమక్షంలోనే అభ్యర్థులను కిడ్నాప్‌ చేశారని, ఆ విషయం పత్రికల్లోనూ వచ్చిందని వివరించారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆక్షేపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చి, నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో, అక్కడి నుంచే పునఃప్రారంభిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పిటిషనర్లు నామినేషన్‌ వేసే అవకాశం లేకుండా పోతోందని తెలిపారు. బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిన చోట ఫిర్యాదులు స్వీకరించి నివేదిక ఇవ్వాలని ఎస్‌ఈసీ కోరిందని, నామినేషన్లు అడ్డుకున్న చోట మరోసారి నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇవ్వలేదని వివరించారు. ఎస్‌ఈసీకి చిత్తశుద్ధి ఉంటే నామినేషన్లు వేసే దగ్గర నుంచి ప్రక్రియను ప్రారంభించాలని పేర్కొన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఎస్‌ఈసీని, తాడిపత్రి మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. విచారణను సోమవారానికి వాయిదా వేశారు.


Updated Date - 2021-02-26T08:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising