ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నానాటికి దిగజారుతున్న ఏపీ ఆర్థిక పరిస్థితి

ABN, First Publish Date - 2021-07-25T18:49:37+05:30

ఏపీలో ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతోంది. అప్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడంలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతోంది. అప్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడంలేదు. ఆస్తులు తాకట్టు పెట్టుకుని రాష్ట్రాభివృద్ధి సంస్థ ద్వారా డబ్బిస్తామన్న బ్యాంకులు కూడా ముఖం చాటేస్తున్నాయి. కేంద్రం రాస్తున్న లేఖలు, సెక్యూరిటీ బాండ్ల వేలంతో సమీకరించిన నిధులు రిజర్వ్ బ్యాంక్ ఓడీకి జమచేసుకోవడం.. రూ. 17వేల కోట్లు రుణ పరిమితికి మించి అప్పులు చేశారని కేంద్రం తాఖీదు పంపడం వంటి సంఘటనలు బ్యాంకులను ఆందోళనలోకి నెట్టాయి. ఈ లోపు కేంద్రం లేఖ, బ్యాంకులతో ఒప్పంద పత్రాలను పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ బహిర్గతం చేశారు. మీడియాలో ప్రముఖంగా రావడంతో ఈ అంశం కేంద్రం వరకు వెళ్లింది. రాష్ట్రంలో విలువైన ఆస్తులు తాకట్టు పెట్టి రాష్ట్రాభివృద్ధి సంస్థ ద్వారా రూ. 25వేల కోట్ల రుణం ప్రతిపాదించడం... ఇందులో ఇప్పటికే రూ. 21,500 కోట్లు సేకరించడంతో ఈ సమాచారం తమకు ఎందుకు చెప్పలేదని కేంద్రం ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పులు తీసుకురావడం సహజమని అమాత్యులు చెబుతున్నప్పటికీ ఏపీలో పరిమితి దాటిందనేదే కేంద్రం అభ్యంతరం.

Updated Date - 2021-07-25T18:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising