ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గులాబ్‌ తుఫాన్‌ నష్టంపై ఏపీ సాయం కోరలేదు: కేంద్రం

ABN, First Publish Date - 2021-12-16T01:01:01+05:30

గులాబ్‌ తుఫాన్‌ నష్టంపై కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఎలాంటి అదనపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: గులాబ్‌ తుఫాన్‌ నష్టంపై కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ఎలాంటి అదనపు ఆర్థిక సాయం కోరలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో తెలిపారు. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ విపత్తు నిధి నుంచి అదనపు సహాయం కోరుతూ ఎలాంటి అభ్యర్థన తమకు అందలేదన్నారు. ఏపీ ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు 'గులాబ్' తుఫాన్‌ కారణంగా 13,990 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు.


తుఫాన్‌ కారణంగా 1,909 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. తుఫాన్‌ తీవ్రతకు 9 మంది మృతి చెందరన్నారు. 116 పశువులు మృత్యువాతపడ్డాయని ఆయన తెలిపారు. విపత్తుల నిర్వహణలో ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో రాష్ట్ర విపత్తు నిధి కోసం కేంద్రం వాటా రూ. 895.20 కోట్లు..రాష్ట్ర వాటా రూ. 297.60 కోట్లు కలిపి మొత్తం రూ. 1,192.80 కోట్లు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటాను అడ్వాన్సు రూపంలో ముందుగానే రాష్ట్రానికి విడుదల చేశామని నిత్యానందరాయ్‌ తెలిపారు.

Updated Date - 2021-12-16T01:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising