ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహా పాదయాత్రకు అనుమతి: డీజీపీ సవాంగ్‌

ABN, First Publish Date - 2021-10-31T00:06:39+05:30

రాష్ట్రంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు డీజీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు డీజీపీ సవాంగ్‌ అనుమతి ఇచ్చారు. రైతుల పాదయాత్రకు 20 షరతులతో డీజీపీ అనుమతి ఇచ్చారు.  హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. గుంటూరు అర్బన్‌, రూరల్‌, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్‌ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు, డీజే సౌండ్లు, బహిరంగసభలు నిర్వహించొద్దని డీజీపీ పేర్కొన్నారు.


కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎన్నికల కోడ్‌ పాటించాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రలో 157 మందికి మించి పాల్గొనకూడదని డీజీపీ ఆదేశించారు. రైతుల పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని డీజీపీ షరతు విధించారు. ప్రతి రోజు ఉ.6 గంటల నుంచి సా.6 గంటలలోగా పాదయాత్ర ముగించాలని డీజీపీ సవాంగ్‌ ఆదేశించారు. 

Updated Date - 2021-10-31T00:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising