ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై పోరు.. ప్రధానిపై జార్ఖండ్ సీఎం విమర్శలు.. వెనకేసుకొచ్చిన జగన్

ABN, First Publish Date - 2021-05-07T21:39:38+05:30

ప్రధాని నరేంద్ర మోదీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరమూ అండగా ఉందామని ట్విట్టర్ వేదికగా జగన్ పిలుపునిచ్చారు. కేంద్రానికి సహకరించాల్సిన తరుణంలో వేలెత్తిచూపడం తగదని హితవు పలికారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తే దేశం బలహీనమవుతుందని పేర్కొన్నారు. సీఎం సోరెన్ అంటే తనకెంతో గౌరవమని, కరోనా సమయంలో రాజకీయాలు తగవని జగన్ సూచించారు. 

ఇంతకీ జార్ఖండ్ సీఎం సోరెన్ ఏమన్నారు....

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా రాష్ట్ర పరిస్థితులను తెలుసుకోడానికి ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు కూడా ఫోన్ చేశారు. రాష్ట్ర పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఫోన్ కాల్ ముగిసిన తర్వాత సీఎం సోరెన్ ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు ప్రధాని మోదీ నాకు ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాటనే చెప్పారు. కట్టడికి ఏం చేయాలో చెబితే బాగుండేది. మా మాట కూడా వింటే బాగుండేది.’’ అంటూ సోరెన్ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు.  


Updated Date - 2021-05-07T21:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising