ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్మీనారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు

ABN, First Publish Date - 2021-12-10T23:34:14+05:30

రిటైర్డ్ ఐఏఎస్ డా.లక్ష్మీనారాయణకు ఏపీ సీఐడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ డా.లక్ష్మీనారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 13న విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది. రిటైర్డ్ ఐఏఎస్, డాక్టర్ లక్ష్మీనారాయణపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏ2గా లక్ష్మీనారాయణ పేరును చేర్చారు. మొత్తం 13 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఏపీ సీఐడీ చేర్చింది. డిజైన్ టెక్, సిమెన్స్ కంపెనీ పేర్లను ఏ4, ఏ5గా సీఐడీ పేర్కొంది.  


రిటైర్డ్ ఐఏఎస్, డాక్టర్ లక్ష్మీనారాయణను ఏపీ సీఐడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.  2017 జీవో ఎంఎస్-4 గురించి తనకు తెలియదని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 8 మంది ఎండీలు మారారని, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న సమయంలో రిటైర్డ్ అయ్యానని తెలిపారు. సిమెన్స్‌తో ఎలాంటి ఒప్పందం కుదిరిందని ఏపీ సీఐడీ ప్రశ్నించారు. సిమెన్స్‌ వివిధ ప్రాంతాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, సిమెన్స్‌ మేనేజ్‌మెంట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సిమెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంవోయూ ఉందని, కార్పొరేషన్ రోజువారీ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదని లక్ష్మీనారాయణ తెలిపారు.




Updated Date - 2021-12-10T23:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising