అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు : అనిల్ సింఘాల్
ABN, First Publish Date - 2021-05-28T03:11:22+05:30
కరోనా చికిత్స విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్
అమరావతి : కరోనా చికిత్స విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖా ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులపై జరిమానాలు విధించామని పేర్కొన్నారు. కరోనా మూడో వేవ్ వస్తే, ఎదుర్కోడానికి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని సింఘాల్ తెలిపారు. గతంలో కంటే గురువారం పాజిటివ్ రేటు తక్కువగా నమోదైందని, ఆక్సిజన్ బెడ్లు కూడా మిగిలిన రోజుల కంటే ఎక్కువ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 84,224 శాంపిళ్లను టెస్ట్ చేయగా, 16,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. కరోనాతో 104 మంది మృతి చెందారని, ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్లలో 16,689 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు ఆస్పత్రుల నుంచి కరోనా బాధితుల డిశ్చార్జీలు పెరిగాయని, అదే సమయంలో అడ్మిషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందని సింఘాల్ తెలిపారు.
Updated Date - 2021-05-28T03:11:22+05:30 IST