రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది: అనిల్‌కుమార్ సింఘాల్
ABN, First Publish Date - 2021-05-24T00:09:48+05:30
ఏపీ కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోందని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
అమరావతి: ఏపీ కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోందని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు 18687 కరోనా కేసులు నమోదయ్యాయని, కరోనాతో గడిచిన 24 గంటల్లో 104 మంది మృతి చెందారని పేర్కొన్నారు. ఏపీకి రోజువారీ 590 టన్నుల ఆక్సిజన్ కేంద్రం కేటాయించిందన్నారు. ఫీవర్ సర్వేలో నమోదైన టెస్ట్ శాంపిల్స్ అన్నింటినీ ల్యాబ్‌కు పంపామని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలను జిల్లాల వారీగా సేకరిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా జిల్లాల వారీగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా సేకరిస్తున్నామని, బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి అవసరమైన మందులని జిల్లాలకే సరఫరా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. తుఫాన్ ప్రభావం కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆక్సిజన్‌పై కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు సమీక్షించామని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
Updated Date - 2021-05-24T00:09:48+05:30 IST