ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాథ పిల్లలకు రూ.10 లక్షలు: సింఘాల్‌

ABN, First Publish Date - 2021-05-20T08:36:08+05:30

కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను  కోల్పోయి అనాథలైన పిల్లలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాతో  తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను జిల్లా కలెక్టర్లు గుర్తించి వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. కాగా కొన్ని నిబంధనలు విధించింది. బీపీఎల్‌ కుటుంబాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.


18 ఏళ్ల చిన్నారులకు అందజేస్తారు. మరణించిన వారికి ఇతర ఇన్సూరెన్సు ఏమీ లేకుండా ఉన్న వారికి మాత్రమే పరిహారం అందిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీని నియమించింది.  అర్హత కలిగిన పిల్లల్ని గుర్తించి జాతీయ బ్యాంకులలో రూ.10 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి. ఈ బాండ్లను పిల్లలకు అందించాలి. పిల్లలు 25 ఏళ్లు వచ్చే వరకూ ఆ మొత్తాన్ని తీసుకోవడానికి లేదు. ప్రతి నెలా వచ్చే వడ్డీని మాత్రం పిల్లలు పోషణకోసం డ్రా చేసుకునే అవకాశం కల్పించారు.  

Updated Date - 2021-05-20T08:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising