ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ప్రాజెక్టులను తెలంగాణ అప్పగిస్తే మేమూ సిద్ధం: ఏపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-10-14T23:44:31+05:30

కృష్ణా నది ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అప్పగిస్తేనే ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కృష్ణా నది ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అప్పగిస్తేనే తాము కూడా అందుకు సిద్ధమని ఏపీ ప్రభుత్వం షరతు విధించింది. జూరాల ప్రాజెక్టును కూడా స్వాధీనం చేసుకోవాలని కేఆర్ఎంబీ ఛైర్మన్‌ను ఏపీ ప్రభుత్వం కోరింది. ఎగువ ప్రాంతంలో ఉన్న జూరాల ప్రాజెక్టును స్వాధీనం చేసుకోకపోతే శ్రీశైలంకు వచ్చే నీటి ప్రవాహానికి ఇబ్బంది ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 


కేఆర్ఎంబీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకు అధికారులు, ప్లాంట్ , యంత్రాలు సిబ్బంది అప్పగింతపై జీవో జారీ చేసింది. కార్యాలయాలు, వాహనాలు, డీపీఆర్‌లు, ఇతర అంశాలపై జీవోలో పేర్కొంది. హెడ్ వర్కుల పరిధిలోని డ్యామ్‌లు, రిజర్వాయర్లు, రెగ్యులేటరీ స్ట్రక్చర్లు అప్పస్తామని, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల స్వాధీనానికి తెలంగాణ ఆమోదిస్తేనే పచ్చ జెండా ఊపుతామని తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టు స్విల్ వే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనావా ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి పథకం పనులు కూడా అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొంది. 




Updated Date - 2021-10-14T23:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising