ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ బకాయిలపై ప్రభుత్వానికి లేఖ రాయండి

ABN, First Publish Date - 2021-04-13T05:46:50+05:30

సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టు విద్యుత్‌ బకాయిలపై ప్రభుత్వానికి లేఖ రాయాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సంబం ధిత అధికారులను ఆదేశించారు.

సత్యసాయి నీటి సరఫరా బోర్డు కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



అధికారులకు కలెక్టర్‌ ఆదేశం


అనంతపురం, ఏప్రిల్‌12 (ఆంధ్రజ్యోతి): సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టు విద్యుత్‌ బకాయిలపై ప్రభుత్వానికి లేఖ రాయాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సంబం ధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సత్యసాయి నీటి సరఫరా బోర్డు కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్‌ బకాయిలు రూ. 189.65 కోట్లు ఉన్నాయన్నారు. ఆ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని ఆయన ఆ ప్రా జెక్టు మెంబర్‌ సెక్రటరీని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వహ ణలో 70 శాతం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంద న్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వ వాటాగా రూ 137.40 కోట్లు విడుదల చేసేవిధంగా ఆ లేఖలో ప్రభుత్వా న్ని  కోరాలన్నారు. లబ్ధిదారుల నుంచి వసూలు చేయాల్సి న మిగిలిన 30 శాతం ఫీజు వసూలుపై  దృష్టి సారించా లని ఆదేశించారు. మున్సిపాల్టీల నుంచి రావాల్సిన రూ. 30.75 కోట్లు, గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన రూ. 59.27 కోట్లు బకాయిలను ఆయా కార్యాలయాలతో చర్చించి వసూలు చేయాలన్నారు. బకాయిల వసూలు కోసం మున్సిపల్‌ కార్యాలయాలకు నీటి సరఫరా నిలిపి వేయడం మంచిది కాదన్నారు. పలు ఆలయాలు, ట్రస్టుల నుంచి అందాల్సిన బకాయిల మొత్తం రూ. 10 లక్షల్లోపే ఉండటంతో వాటిని మాఫీ చేయాలన్నారు. ఆ మేరకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత బకాయిలను మాఫీ చేసినప్పటికీ... భవిష్యత్తులో నీటి వృథా అరికట్టేం దుకు ఆ ఆలయాలు, ట్రస్టుల నుంచి కనీస రుసుము వసూలు చేయాలన్నారు. బోర్డు నిర్వహణకు సంబంధించి గతేడాది నిధుల వ్యయం రూ. 26.51 కోట్లు, రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు నిర్వహణ, అంచనా వ్య యాలపై నివేదిక ఇవ్వాలని ఆ ప్రాజెక్టు మెంబర్‌ సెక్రటరీ హరిబాబును కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో సత్య సాయి ట్రస్టు ప్రతినిధి రామేశ్వర్‌పృష్టి, జడ్పీ సీఈఓ శోభాస్వరూపారాణి, డీపీఓ పార్వతి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ, ట్రాన్స్‌-కో ఎస్‌ఈ వరకుమార్‌తో పాటు పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T05:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising