ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ లేఅవుట్‌పై కొరడా

ABN, First Publish Date - 2021-04-09T05:46:31+05:30

హిందూపురం మునిసిపాలిటీ పరిధిలో అక్రమ అవుట్లపై మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు కొరడా ఝుళిపించారు.

అక్రమ లేఅవుట్ల తొలగిస్తన్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం టౌన , ఏప్రిల్‌ 8: హిందూపురం మునిసిపాలిటీ పరిధిలో అక్రమ అవుట్లపై మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు కొరడా ఝుళిపించారు. పట్టణ పరిధిలోని పలుచోట్ల అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేఅవుట్లను గుర్తించి వాటిలో ఉన్న రాళ్లను, కంచెను తొలగించారు. దండు రోడ్డులో మూడుచోట్ల అక్రమ లేఅవుట్లు ఉండగా కమిషనర్‌తోపాటు టౌనప్లానింగ్‌ అధికారి హరిదాసు, సిబ్బంది వెళ్లి తొలగించారు. అదేవిధంగా పెనుకొండ రోడ్డులోని ఏ1 స్టీల్‌ ఫ్యాక్టరీ వెనుక అనుమతి లేకుండా 8ఎకరాల్లో వేసిన అక్రమ లేఅవుట్‌లో ఉన్న రాళ్లను తొలగించారు. ఎవరైనా అనుమతి లేకుండా లేఅవుట్‌ వేస్తే వారికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని కమిషనర్‌ హెచ్చరించారు. 

‘అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు’

కొంతమంది అధికారుల పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మునిసిపల్‌ కమిషనర్‌ అన్నారు. అలా ఎవరైనా చేస్తే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. వారు బయటి వ్యక్తులైనా లేదా కార్యాలయంలో పనిచేసే సిబ్బందైనా ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు. ఎక్కడైనా మునిసిపల్‌ కమిషనర్‌గాని, ఇతర అధికారుల పేర్లు చె ప్పి అక్రమంగా డబ్బు గుంజడానికి ప్రయత్నిస్తే వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. అలాంటివారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 


Updated Date - 2021-04-09T05:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising