ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టాలకు తెరపడేదెప్పుడో..?

ABN, First Publish Date - 2021-06-20T06:49:05+05:30

కరోనా మహమ్మారి దెబ్బ సినిమా థియేటర్లపై పడింది. కర్ఫ్యూతో రెండు నెలలుగా సినిమా హాళ్లు తలుపులు తెరుచుకోలేదు.

పట్టణంలో మూత పడిన ఓ సినిమా థియేటర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కర్ఫ్యూతో మూతబడిన సినిమా థియేటర్లు

నష్టాల్లో యజమానులు.. ఉపాధిలేక కార్మికులు


ఉరవకొండ, జూన 19: కరోనా మహమ్మారి దెబ్బ సినిమా థియేటర్లపై పడింది. కర్ఫ్యూతో రెండు నెలలుగా సినిమా హాళ్లు తలుపులు తెరుచుకోలేదు. దీంతో అభిమాన నటీనటులను తెరపై చూసేందుకు అభిమానులు నిరీక్షిస్తుండగా... మరోవైపు థియేటర్లనే నమ్ముకుని జీవనం సాగిస్తు న్న యజమానులు, కార్మికుల బతుకుపై కరోనా దెబ్బకొట్టింది. లాక్‌డౌన కా రణంగా గతేడాది సుమారుగా 10 నెలల పాటు థియేటర్లు మూతపడ్డా యి. ఈ ఏడాది కర్ఫ్యూతో రెండు నెలలుగా వెండి తెరపై రంగుల ప్రపం చం మాయమైంది. తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని థియేటర్‌ యజమానులు, కార్మికులు, సిబ్బంది ఎదురు చూస్తున్నారు. జిల్లాలో దాదాపుగా 100 థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్ల మీద ఆధారపడి రెండు వేల మందిదాకా జీవిస్తున్నారు. వేసవి సీజనలో కొత్త సినిమాలు విడుదలవుతాయి. ఆ సమయంలో థియేటర్‌ల వద్ద సందడి అంతా ఇంత కాదు. వ్యాపార లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతాయి. గత వేసవితో పాటు, ఈ వేసవిలోనూ సందడి లేకుండా పోయింది. కరోనా వైరస్‌ ఉధృతితో థి యేటర్లు మూత పడడటంతో  వ్యాపార లావాదేవీలు ఎక్కడికక్కడ స్తం భించడంతో యజమానులు నష్టాలను చవిచూశారు. సినిమా హాళ్లలో పనిచేసే కార్మికులు, సిబ్బందికి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. 


నిర్వహణ భారమై..

కరోనా కారణంగా థియేటర్లు మూతపడినా నెలకు నిర్వహణ ఖర్చు మా త్రం  తప్పడం లేదని యజమానులు వాపోతున్నారు. కరెంట్‌ బిల్లులు, ఇత ర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒక్కొక్క థియేటర్‌లో క్యాంటీన వి భాగాలలో కలిసి 20 మంది దాకా పని చేస్తుంటారు. ప్రస్తుతం ఒకరిద్దరు మాత్రమే పని చేస్తున్నారు. మిగిలిన వారంతా పనులు లేక ఖాళీగా ఉంటున్నారు.   ఏసీ థియేటర్‌లో అయితే సినిమాలు ప్రదర్శించకపోయినా హెచటీ కరెంట్‌ బిల్లు నెలకు రూ.50వేలు వస్తుందని థియేటర్‌ యజమానులు వాపోతున్నారు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో.. ఈకష్టాలకు ఎప్పుడు తెర పడుతుందోనని ఎదురుచూస్తున్నారు.


జీతాలు లేక ఇబ్బందులు:

 పెద్దయ్య, థియేటర్‌ మేనేజరు, ఉరవకొండ

గత ఏడాది 10 నెలలు జీతాలు లేవు. ఈ ఏడాది రెండు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ప డుతున్నాం. సినిమా హాళ్లు తెరిస్తేనే మాకు ఉపాధి. కుటుంబం గడవడం కూడా కష్టమే. ఎప్పుడు తెరుస్తారోనని ఎదురు చూస్తున్నాం. ఒకవైపు కరోనాతో అల్లాడుతుంటే మరోవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో కుటుంబం ఎలా నెట్టుకురావాలో అర్థం కాక అల్లాడిపోతున్నాం. 


సినిమా హాళ్లు తెరిస్తేనే కష్టాలు తీరేది..:

వన్నూర్‌ స్వామి, థియేటర్‌ ఆపరేటర్‌

సినిమా హాళ్లు తెరిస్తేనే కష్టాలు తీరతాయి. కరోనా కారణంగా గత ఏడాది 10 నెలలుగా సినిమా హాళ్లు మూతపడ్డాయి. ఆ సమయంలో కొన్ని నెలలు జీతాలు ఇవ్వలేదు. కుటుంబం గడవక అవస్థలు పడ్డాం. ఈ ఏడాది దాదాపుగా రెండు నెలలుగా సినిమా హాళ్లు తెరవలేదు. ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. 

Updated Date - 2021-06-20T06:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising