ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక.. వారానికోసారే వ్యాక్సిన్‌?

ABN, First Publish Date - 2021-06-23T06:11:37+05:30

కరోనా టీకా పంపిణీ ఇక వారానికోసారి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆదివారం ఒకేరోజు లక్ష మందికి జిల్లాలో వేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకేసారి పంపిణీకే ఇలా.. మిగిలి ఉన్న టీకా పక్కదారి?


అనంతపురం వైద్యం, జూన్‌ 22: కరోనా టీకా పంపిణీ ఇక వారానికోసారి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆదివారం ఒకేరోజు లక్ష మందికి జిల్లాలో వేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆ మేరకు మెగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర స్థాయిలోనూ ఇదే పద్ధతిలో జరిగింది. ప్రభుత్వం ఈ మెగా టీకా పంపిణీని గొప్ప గా చెప్పుకుంది. దీంతో ఇకపై వారానికోరోజు మెగా టీకా పంపిణీ చేపట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపినట్లు వైద్యవర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే రెండు రోజులుగా టీకా జిల్లాకు సరఫరా కాలే దు. జిల్లాలోనూ టీకా పంపిణీ కొనసాగలేదు. దీంతో టీకా వేయించుకోవాలనేవారు నిరాశతో చూస్తున్నారు. ఇప్పటి వరకు 45 ఏళ్లపైబడిన వారికి, ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకా వేశారు. మెగా వ్యాక్సిన్‌ పంపిణీ పేరుతో లక్ష్యం పెట్టడంతో వైద్య సిబ్బంది ఇతర అధికారులు టార్గెట్‌ ఛేదించేందుకు నిబంధనలు గాలికొదిలినట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి కూడా 45 ఏళ్లు నమోదు చేసి, టీకా వేసినట్లు ఆ పిల్లల త ల్లిదండ్రులే చెబుతున్నారు. పీహెచ్‌సీల్లో మిగిలి ఉన్న టీకా సైతం ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా పక్కధారి పట్టిస్తున్నట్లు వైద్యవర్గాల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు క్షేత్రస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా టీకా వేయించుకునేవారి నుంచి కొంత మేర సొమ్ము వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పర్యవేక్షణాధికారులు మాత్రం టీకా ఏం చేస్తున్నారని కూడా ఆలోచించకపోవడం శోచనీయం. కేంద్రం ఇక నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి టీకా వేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆంక్షల పేరుతో వేయడం లేదు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన వారికి టీకా వేస్తామని ప్రకటించింది. జిల్లా వైద్యశాఖకు అలాంటి ఆదేశాలు రాలేదనీ, పైగా టీకానే సరఫరా కాలేదనీ, ఆదేశాలు వస్తే వేస్తామని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా టీకా కావాలంటే వారం ఆగాల్సిందే.


Updated Date - 2021-06-23T06:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising