ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ABN, First Publish Date - 2021-08-06T06:29:55+05:30

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ నాగలక్ష్మీ పేర్కొన్నారు.

గుట్టూరులో ఉద్యోగులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామ సచివాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

పెనుకొండ రూరల్‌, ఆగస్టు 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ నాగలక్ష్మీ పేర్కొన్నారు. మండలంలో గుట్టూరులోని గ్రామ సచివాలయాన్ని కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ నవీన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా సచివాలయాల్లో అమలవుతున్న ప్రభుత్వ సక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. సచివాలయాల్లో పోస్టర్లు, క్యాలెండర్ల వివరాలు వివిధ పథకాలకు సంబంధించి అర్హులైన లబ్దిదారుల జాబితా తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. వలంటీర్లకు కూడా రోజు విడిచిరోజు అటెండెన్స్‌ వేసేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ప్రతి రోజూ వచ్చే ఫిర్యాదుల దరఖాస్తులుతీసుకుని వాటిని పరిష్కరించే విధంగా చూడాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీఓ శివశంకరప్ప, ఈఓఆర్డీ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి రమేష్‌ పాల్గొన్నారు. 

 


Updated Date - 2021-08-06T06:29:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising