ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెర్లోపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల

ABN, First Publish Date - 2021-11-06T06:34:15+05:30

మండల పరిధిలోని చెర్లోపల్లి జలాశయం నుంచి శుక్రవారం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ డీఈ వెంకటేశులుశెట్టి నీటిని విడుదల చేశారు.

నీటిని విడుదల చేస్తున్న హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరిఅర్బన్‌ , నవంబరు 5 : మండల పరిధిలోని చెర్లోపల్లి జలాశయం నుంచి శుక్రవారం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ డీఈ వెంకటేశులుశెట్టి నీటిని విడుదల చేశారు. తొలుత గంగపూజ నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా చెర్లోపల్లి రిజర్వాయర్‌ను నీటితో నింపుతున్నామన్నారు. జీడిపల్లి రిజర్వాయర్‌ను 25 రోజుల నుంచి ఇప్పటి వరకు 1.15 టీఎంసీ నీటిని రిజర్వాయర్‌లో నింపగలి గామన్నారు. అధికారుల ఆదేశానుసారం శుక్రవారం చెర్లోపల్లి రిజర్వాయర్‌ నుంచి పుంగునూర్‌ బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా తంబళ్ళపల్లి, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాల మీదుగా కుప్పంకు నీటిని విడుదల చేశామన్నారు. నేడు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, అంచెలంచెలుగా 150, 200 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తామన్నారు. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి చెర్లోపల్లి రిజర్వాయర్‌కు 150 నుంచి 160 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందన్నారు. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి చెర్లోపల్లి రిజర్వాయర్‌కు వచ్చే ఏడాది మా ర్చి, ఏప్రిల్‌ వరకు ఇన్‌ప్లో ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఈలు దాదాఖలందర్‌, పాండురంగ, శ్యాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-06T06:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising