ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హంద్రీనీవాకు నీరు బంద్‌

ABN, First Publish Date - 2021-04-13T05:42:34+05:30

హంద్రీనీవా కాలువలో సో మవారం నీటి పారుదల నిలిచిపోయింది. 263 రోజుల నిరంతరాయ పంపింగ్‌ను ఉదయం ఐదున్నరకు ముచ్చు మర్రి పంపింగ్‌ వద్ద ఎత్తిపోతలను ఇరిగేషన్‌ అధికారులు నిలిపివేశారు.

నీటి పారుదల ఆగిన హంద్రీనీవా కాలువ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పంపింగ్‌ నిలిపివేత

గుంతకల్లు, ఏప్రిల్‌ 12 : హంద్రీనీవా కాలువలో సో మవారం నీటి పారుదల నిలిచిపోయింది. 263 రోజుల నిరంతరాయ పంపింగ్‌ను ఉదయం ఐదున్నరకు ముచ్చు మర్రి పంపింగ్‌ వద్ద ఎత్తిపోతలను ఇరిగేషన్‌ అధికారులు నిలిపివేశారు. దీంతో సాయంత్రానికి జిల్లాలోని రాగుల పాడు వద్ద ఉన్న 8వ పంపు హౌస్‌ వద్ద కూడా ఎత్తిపో తలు నిలిచిపోయాయి. గత జూలై నుంచి ఇప్పటి వరకూ దాదాపు ఎనిమిదిన్నర నెలలపాటు నీటిని ఎత్తిపోసిన పంపులు ఒక్కసారిగా నిలిచిపోయాయి.


42 టీఎంసీల నీరు ఎత్తిపోత

2020 జూలై 23వ తేదీన ప్రారంభమైన హంద్రీనీవా ఎత్తిపోతలు 263 రోజులపాటు కొనసాగగా 42 టీఎంసీల నీరు ఈ ప్రాజెక్టులో పారింది. మార్చి 27వ తేదీ వరకూ మల్యాల పంపుల ద్వారా నీటిని అందించారు. డ్యాంలో నీరు అడుగంటడంతో మల్యాల పంపులకు విశ్రాంతినిచ్చి మార్చి 27వ తేదీ నుంచి కేసీ కెనాల్‌కు నీటిని పంపుచేసే ముచ్చుమర్రి పంపుల ద్వారా నీటిని హంద్రీనీవాకు మళ్లించారు. ఈ ప్రత్యామ్నాయ ప్రాజెక్టు పంపింగ్‌ ద్వారా 14 రోజులపా టు నీటిని ఎత్తిపోసి మరో రెండు టీఎంసీలు ఇచ్చారు. మొత్తంపైన 44 టీఎంసీలు నీరు వచ్చినట్లైంది. ఈ 44 టీఎంసీ ల్లో మొదటి దశలోని కర్నూలు జిల్లాకు 7 టీఎంసీలు, మొదటి దశలోని అనంతపురం జిల్లా, 2వ దశలోని మూ డు జిల్లాలకు 37 టీఎంసీలు లభించాయి.


ఆగిన అనుబంధ కాల్వల పారుదల 

హంద్రీనీవాకు నీటి పారుదల నిలిచిపోవడంతో దాని ద్వారా చెరువులకు నీరందిస్తున్న అనుబంధ కాల్వల నీటి పారుదలకు కూడా బ్రేక్‌పడింది. వజ్రకరూరు మండలం గడేహోతూరు వద్ద ఉన్న డిస్ట్రిబ్యూటరీలకు నీటి పారుదల నిలిచింది. కసాపురం వద్ద ఉన్న తూము నుంచి పాత కొత్తచెరువుకు, జీ కొట్టాల వద్ద నుంచి జీఎ్‌సబీసీ ద్వారా చండ్రాయని కుంట రిజర్వాయరుకు, వైటీ చెరువు, గుత్తి చెరువులకు నీరందిస్తున్న ఉపకాల్వలకు సరఫరా నిలిచి పోయింది. అలాగే ఏబీసీ ద్వారా ఆలూరు చెరువుకు నీటి సరఫరా ఆగింది. గుంతకల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకుకు కూడా తాగునీటి అవసరాలకు పంపింగ్‌ ఆగింది.

 

Updated Date - 2021-04-13T05:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising