ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతికేళ్లుగా నడక ప్రయాణం

ABN, First Publish Date - 2021-05-06T06:20:56+05:30

పాతికేళ్లుగా నిరంతరం పాదయాత్ర చేస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నాడు వెంకటేశ్‌. మడకశిర మండలం చందకచర్ల గ్రామానికి చెందిన ఆర్యవైశ్య వెంకటేశ్‌ గత 25ఏళ్లుగా పాదయాత్ర చేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు.

పాదయాత్ర చేస్తున్న వెంకటేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రోజూ 20 కిలోమీటర్ల నడక... నడవకుంటే కష్టమంటున్న వెంకటేష్‌

రొద్దం, మే 5 : పాతికేళ్లుగా నిరంతరం పాదయాత్ర చేస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నాడు వెంకటేశ్‌. మడకశిర మండలం చందకచర్ల గ్రామానికి చెందిన ఆర్యవైశ్య వెంకటేశ్‌ గత 25ఏళ్లుగా పాదయాత్ర చేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు. రోజుకు 20 కిలోమీటర్ల కాలిబాటపడుతూ భోజన విరామం కోసం ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటాడు. పావగడ నుంచి రొద్దం మీదుగా ఎల్‌జిబినగర్‌వరకు పాదయాత్ర చేశాడు. పెనుకొండ, బికెపల్లి, ఎన్‌ఎ్‌సగేట్‌ వద్దకు వెళ్లి సేదతీరుతాడు. అక్కడినుంచి రామగిరి, ఎగువపల్లికి చేరుకుంటాడు. అటునుండి కర్నాటక ప్రాంతం తిరుమణి మీదుగా పావగడకు చేరుకుంటాడు. ఇలా ప్రతిరోజూ ఈప్రాంతం మీదుగా పాదయాత్ర చేస్తూ భుజాన సంచి వేసుకుని చేతిలో కర్రపట్టుకుని రోడ్డుపై ఒక్కడే పాదయాత్ర చేస్తూ ఉంటాడు. ఎండ, గాలి, వానకు తడుస్తూ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా తన పాదయాత్రను కొనసాగిస్తాడు. ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకుంటాడుతప్పా తాను ఎవడిని చేయి చాచి అడగడు. ఇతన్ని కర్నాటక అధికారులు చిత్రదుర్గంలో ఆశ్రయం కల్పించి వదిలేశారు. ఎందుకిలా నిత్యపాదయాత్ర చేస్తున్నావని ఆంధ్రజ్యోతి పలకరించగా తనకు ఒకేచోట ఆశ్రయం పొందితే పాము కలలోకి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తుందని అందుకే ఇలా పాదయాత్ర చేస్తుంటానని తెలిపాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఒకరు చనిపోగా మరొక భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తన పాదయాత్ర సందర్భంగా వచ్చిన డబ్బులతో సైకిల్‌ కొని సైకిల్‌పై యాత్ర కొనసాగిస్తానన్నాడు. ప్రభుత్వం తనకు పెన్షన్‌ ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు. 


Updated Date - 2021-05-06T06:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising