ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు ప్రాంతాల్లో రైలు కిందపడి ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-04-13T06:30:22+05:30

గుత్తి జీఆర్పీ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైలు కిందపడి మృతి చెందినట్లు రై ల్వే పోలీసులు తెలిపారు.

మృతి చెందిన టక్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుత్తి, ఏప్రిల్‌ 12: గుత్తి జీఆర్పీ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైలు కిందపడి మృతి చెందినట్లు రై ల్వే పోలీసులు తెలిపారు. జక్కలచెరువు రైల్వే స్టేషన సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు రైలులో నుంచి కిందపడి హైదరాబాద్‌కు చెందిన యువతి టక్రి (35) మృతి చెందింది. కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లి తిరిగి వెంకటాద్రి ఎక్స్‌ప్రె్‌సలో వస్తూ జక్కలచెరువు రైల్వేస్టేషన సమీపంలో ప్రమాదవశాత్తు రైలులో నుంచి కిందపడి మృతి చెందింది.


అదేవిధంగా గుత్తి రైల్వే స్టేషన సమీపంలో సోమవారం సూరసింగనపల్లికి చెం దిన రైల్వే ఉద్యోగి శంకర్‌ నారాయణ(56) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆ ర్పీ పోలీసులు తెలిపారు. నారాయణ కడప రైల్వే ఆసుపత్రిలో డ్రెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండేవాడని, దీంతో మనస్తాపం చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-04-13T06:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising