ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

ABN, First Publish Date - 2021-06-23T06:30:23+05:30

ఓవర్‌టేక్‌ చేసే సమయంలో పల్లెవెలుగు బస్సును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్‌ బస్సు

ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఢీకొనడంతో డివైడర్‌ ఎక్కిన పల్లెవెలుగు బస్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఐదుగురు ప్రయాణికులకు గాయాలు... త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

అనంతపురం క్రైం, జూన 22 : నగరంలోని తపోవనంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణి కులు గాయపడ్డారు. ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాలు  ఇలా ఉన్నాయి. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి మంగళవారం సా యంత్రం అనంతపురం డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు గుత్తికి బయల్దేరింది. గార్లదిన్నెకు చెందిన రంగన్న, అదే మం డల పరిధిలో ని ఇల్లూరుకు చెందిన అదెప్ప, కామాక్షమ్మ అనే దంపతులు, గుత్తికి చెందిన శ్రీరాములు, ఆంజినమ్మ అనే దంపతులు ఆయా ప్రాంతాల కు వెళ్లేందుకు అందులో ఎక్కారు. ఆయితే ఆ బస్సు నగర శివారు లోని తపోవనం సర్కిల్‌ సమీపంలోకి రాగానే.. అదే సమయంలో గుంతకల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు వచ్చి ఓవరటేక్‌ చేసే ప్రయత్నంలో వెనుకవైపు నుంచి పల్లెవెలుగు బస్సును ఢీకొట్టింది. దీంతో పల్లెవెలుగు బస్సు రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఎ క్కి ఆగిపోయింది. ఎక్స్‌ప్రెస్‌ బస్సు రోడ్డు అంచుకువెళ్లి ఆగింది. ఆయి తే పల్లె వెలుగులో వెనుక వైపు కూర్చున్న పై ఐదుగురు బస్సులోని ర్యాడ్‌లు, సీట్లకు చెందిన ఇనుకకడ్డీలు తగిలి గాయప డ్డారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సు ముందు అద్దం అక్కడిక క్కడే ధ్వంసమైంది. ఆయితే డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ప్ర మాదానికి గురికావడంతో ఆరగంట పాటు ట్రాఫిక్‌ అంతరాయం ఏ ర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ప్రమాదం జ రిగిన సమయంలో ఆ రోడ్డుపై వాహనాలు ఎక్కువుగా రాకపోవడం తో ఎవరికి ఎలాంటి ఆపద జరగలేదు. పల్లెవెలుగులోని ఐదుగురు కూడా స్వల్పగాయాలతో సురక్షితంగా బయట పడడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఘటన జరిగిన వెంటనే ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బస్సులను పక్కకు తీసి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చేశారు. 


Updated Date - 2021-06-23T06:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising