ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడిని 12 కి.మీ., ఈడ్చుకెళ్లిన రైలు

ABN, First Publish Date - 2021-10-19T06:04:33+05:30

పెనుకొండ పాత రైల్వేగేటు వద్ద సోమవారం ఓ యువకుడిని రైలు ఢీకొని, ఏకంగా 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది.

రైలు ఇంజినకు చిక్కుకున్న యువకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ రూరల్‌, అక్టోబరు 18: పెనుకొండ పాత రైల్వేగేటు వద్ద సోమవారం ఓ  యువకుడిని రైలు ఢీకొని, ఏకంగా 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ యువకుడు దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పెనుకొండ పట్టణంలోని ఆల్విన కాలనీకి చెందిన మంజునాథ్‌ (26)ను ఆర్టీసీ డిపో సమీపంలోని పాత రైల్వే గేటు వద్ద పట్టాలపై ఉండగా బెంగళూరు నుంచి వచ్చిన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ రైలు యువకుడిని ఢీకొని మక్కాజిపల్లి రైల్వేస్టేషన వరకు లాక్కెళ్లింది. రైలు ఇంజిన ముందు యువకుడు వేలాడుతుండగా గుర్తించిన పెద్దచెరువుకట్ట ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న రైల్వే గేటుమెన్లు మక్కాజిపల్లి రైల్వేస్టేషనకు సమాచారం ఇచ్చారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ రైలును మక్కాజిపల్లి రైల్వే స్టేషనలో ఆపి యువకున్ని బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. పెనుకొండ నుంచి 12 కి.మీ. మేరకు యువకున్ని ఈడ్చుకెళ్లిడంతో రెండు కాళ్లు పూర్తిగా కట్‌ అయిపోయాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్ట్‌మార్టం నిమి త్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంజునాథ్‌ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు చెప్పినట్లు రైల్వేపోలీసులు తెలిపారు. ముంజునాథ్‌ అత్మహత్యకు యత్నించాడా, ప్రమాదవుశాత్తు రైలు పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురయ్యాడా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పెనుకొండ రైల్వే పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-10-19T06:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising