ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సంక్షేమమే సీఎం ధ్యేయం

ABN, First Publish Date - 2021-04-21T05:58:52+05:30

రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగనమోహనరెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు

వైఎ్‌సఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల చెక్కును పంపిణీ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి శంకర్‌నారాయణ 

  వీసీ ద్వారా సున్నావడ్డీ పథకాన్ని ప్రారంభించిన సీఎం

 జిల్లాలో 60886 మంది రైతులకు రూ.4.63 కోట్ల లబ్ధి

అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్‌ 20 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగనమోహనరెడ్డి  పనిచేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స ద్వారా వైఎ్‌సఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని సీఎం ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్‌ నుంచి మంత్రి శంకర్‌నారాయణ, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌, కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ శమంతకమణి వీడియోకాన్ఫరెన్సకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎ్‌సఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2019-20 రబీ సీజనలో 627906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు వారి ఖాతాల్లోకి జమ చేశామన్నారు. జిల్లాలో తొలి విడతలో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించిన 60886 మంది రైతులకు రూ.4.63 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. రైతు భరోసా, సున్నా వడ్డీ పథకం, ఉచిత పంటల బీమా, సబ్సిడీతో వేరుశనగ, ఎరువుల పంపిణీ, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పించడం తదితర కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో జేసీ నిశాంతకుమార్‌, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T05:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising