ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దున్నపోతును బందించిన గ్రామస్థులు

ABN, First Publish Date - 2021-06-28T04:53:01+05:30

ఎనుముల కాపరి నారాయణ మృతికి కారణమైన దున్నపోతును రొద్దం గ్రామస్థులు బంధించారు.

మారెమ్మ ఆలయం వద్ద బంధించిన దున్నపోతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, జూన 27: ఎనుముల కాపరి నారాయణ మృతికి కారణమైన దున్నపోతును రొద్దం గ్రామస్థులు బంధించారు. శనివారం సాయంత్రం మేపుకోసం ఎనుములను పొలాల్లోకి తోలుకెళ్లిన నారాయణ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ఆంబోతు నాలుగు మార్లు పైకి లేపుతూ కుమ్మింది. దీంతో  ఎనుముల కాపరి మృతిచెందాడు. దున్నపోతు యజమాని బోయ రామాంజి సహాయంతో ఆదివారం గ్రామస్థులు దున్నపోతును పెద్దపెద్ద తాళ్ళతో బంధించి ట్రాక్టర్‌కు కట్టి మారెమ్మ దేవాలయం వద్దకు తీసుకు వచ్చి టెంకాయ చెట్టుకు కట్టేశారు. పావగడ, పెనుకొండ ప్రధాన రహదారి పక్కనే దున్నపోతును బంధించడంతో జనం తండోపతండాలుగా వచ్చి తిలకించారు. అయితే దున్నపోతును మంగళవారం మారెమ్మదేవతకు బలిచ్చేందుకు గ్రామస్థులు సన్నద్దం అవుతున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-06-28T04:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising