ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-09-29T06:32:40+05:30

జిల్లాలో రైతులు సాగు చే సిన వేరుశనగ, కంది తదితర పంటలు వర్షాభావం తో నిలువునా ఎండిపోయాయనీ, ప్రభుత్వం ఆర్థికసాయం అందించి, ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

హంపాపురం వద్ద వేరుశనగ పంటను పరిశీలిస్తున్న రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేదంటే అప్పులపాలే.. ఎండిన వేరుశనగ పంటను పరిశీలించిన 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రాప్తాడు, సెప్టెంబరు 28: జిల్లాలో రైతులు సాగు చే సిన వేరుశనగ, కంది తదితర పంటలు వర్షాభావం తో నిలువునా ఎండిపోయాయనీ, ప్రభుత్వం ఆర్థికసాయం అందించి, ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మండలంలోని హంపాపురం సమీపాన రైతు చిట్రా నారాయణ వేరుశనగ పొలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవకపోవడంతో కళ్ల ముందే పంటలు నిలువునా ఎండిపోతున్నాయన్నారు. వేరుశనగ సాగు చేసిన రైతులు ఎక్కువగా నష్టపోయారన్నారు. ఎకరాకు రూ.30 వేల వరకూ ఖర్చు చేసి, పంట సాగు చేశారన్నారు. వర్షాభావంతో దిగుబడి లేకుండా పోయిందన్నారు. కళ్లముందే పంట నిలువునా ఎండిపోతుంటే అన్నదాతలు కంట తడి పెడుతున్నారన్నారు. పంట సాగుకు చేసిన అప్పులు కూడా తీర్చలేకపోతున్నారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అధికారుల ద్వారా అంచనా వేయించి, ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేరుశనగ రైతులకు ఎకరాకు రూ.25 వేలు నష్ట పరిహారం అందించాలన్నారు.

Updated Date - 2021-09-29T06:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising