ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2021-06-18T06:17:09+05:30

కరోనా రెండో విజృంభించి ప్రజలను నానాఇబ్బందులకు గురి చేసినా ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తచెరువు, జూన 17: కరోనా రెండో విజృంభించి ప్రజలను నానాఇబ్బందులకు గురి చేసినా ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకులు అన్నారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అందరికి వ్యాక్సిన ఇచ్చి ప్రజల ప్రాణాలను కాపా డాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని, ఆక్సిజన అందక మృతి చెందిన కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక కరోనా సమయంలో చిరువ్యాపారస్థులు ఆర్థికంగా చితికిపోయారని వారిని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ రామక్రిష్ణ, కో కన్వీనర్‌ శ్రీనివాసులు,టీడీపీ నాయకులు గాజుల చంద్రమోహన, రాజప్ప, సుబ్బరాయుడు, పెద్దన్న, మైనార్టీనాయకులు సైకిల్‌షాపు బాబా చికెన సెంటర్‌ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-18T06:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising