ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతలో వృద్ధుడి వక్ర బుద్ధి.. ఉద్యోగ విరమణ చేయాల్సిన వయసులో ఓ యువతిని బైక్‌పై ఎక్కించుకుని..

ABN, First Publish Date - 2021-10-14T06:29:11+05:30

మాయమాటల తో అమ్మాయిలను వంచించే నగర పాలక సంస్థ ఉద్యోగి మాధవరెడ్డిని దిశ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మాధవరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాయమాటలతో అమ్మాయిలను వంచిస్తున్న వైనం 

నగరపాలక సంస్థ ఉద్యోగి మాధవరెడ్డి అరెస్ట్‌

అనంతపురం క్రైం, అక్టోబరు 13: మాయమాటలతో అమ్మాయిలను వంచించే నగర పాలక సంస్థ ఉద్యోగి మాధవరెడ్డిని దిశ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి, అతడి స్కూటీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి దిశ డీఎస్పీ శ్రీనివాసులు బుధవారం వివరాలు వెల్లడించారు. నగరపాలక సంస్థకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి (వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌) కుంతురు మాధవరెడ్డి గత కొన్నేళ్లుగా నగరంలోని పలు కళాశాలలకు చెందిన అమ్మాయిలు, యువతులను లక్ష్యంగా చేసుకుని మాయమాటలతో నమ్మించి పరిచయం పెంచుకునేవాడు. ఆ తర్వాత ఫోన్ నెంబర్‌ ఇవ్వడం, వారి నెంబర్‌ తీసుకోవడంతో పాటు మరింత దగ్గరవుతాడు. వారి అవసరాలను అదనుగా చేసుకుని, లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు శారీరకంగా వాడుకుని వదిలేసేవాడు. గత కొన్నేళ్లుగా ఇదే వ్యవహారంలో ఆ ఉద్యోగి మునిగితేలుతున్నాడు. అంతేకాకుండా బ్రోకర్‌ వ్యవహారం కూడా నడిపించాడని సమాచారం. ఈ క్రమంలో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2008లోనే ఓ లాడ్జీలో ఇద్దరు మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్టు నగరంలోని వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగరీత్యా పలు ఆరోపణల నేపథ్యంలో రెండు సార్లు సస్పెండ్‌ అయ్యాడు. అయినా ఇతడిలో ఏమాత్రం మార్పురాలేదు. ఈ ఏడాది నవంబరులో ఉద్యోగ విరమణ కూడా చేయాల్సి ఉంది. కానీ తన వక్రబుద్ధి మాత్రం మానలేదు. పది రోజుల కిందట ఓ యువతికి స్కూటీలో లిఫ్ట్‌ ఇస్తానని నమ్మబలికి నగర శివారుకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించి, బలవంతం చేయబోయాడు. ఆ తర్వాత బాధిత యువతి తన తల్లిదండ్రులతో కలిసి దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిశ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నగర శివారులోని ప్రసన్నాయపల్లి రైల్వేగేటు సమీపంలో బుధవారం సాయంత్రం నిందితుడిని అరెస్ట్‌ చేసి స్కూటీని  స్వాధీనం చేసుకున్నారు. జిల్జా జడ్జి ఆయనకు 15 రోజుల రిమాండ్‌ విధించారు. కాగా మాధవరెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే దిశ పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-10-14T06:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising