ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరేసముద్రంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-04-09T05:48:12+05:30

మండల పరిధిలోని హరేసముద్రం గ్రామంలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో పోలింగ్‌ ముగియగానే గ్రామానికి ఎస్‌ఐ శేషగిరి,సిబ్బంది వెళ్లారు.

డీఎస్పీని చుట్టుముట్టిన కాలనీ వాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ధర్నా

మడకశిర రూరల్‌, ఏప్రిల్‌ 8: మండల పరిధిలోని హరేసముద్రం గ్రామంలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో పోలింగ్‌ ముగియగానే గ్రామానికి ఎస్‌ఐ శేషగిరి,సిబ్బంది వెళ్లారు. ఎస్సీ కాలనీకి చెందిన సంజీవ్‌కుమార్‌, జాన్సనకుమార్‌ అనే ఇద్దరిపై చేయిచేసుకున్నారు. అంతేకాక వారిని తీసుకువెళ్లి చెరువుకట్టపై చితకబాధడంతో ఆగ్రహించిన ఎస్సీ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఆంటోనప్ప, సీఐ రాజేంద్రప్రసాద్‌, సిబ్బందితో వచ్చి గ్రామంలో జరిగిన సంఘటనపై ఆరాతీశారు. ఎస్‌ఐ చేయిచేసుకున్న ఇద్దరు యువకులు కనిపించకపోవడంతో వారిని మాకు అప్పగించాలని డీఎస్పీ, సీఐలను చుట్టుముట్టారు. దీంతో కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. యువకులను అప్పగిస్తామని చెప్పడంతో కాలనీ వాసులు శాంతించారు. దురుసుగా ప్రవర్తిస్తున్న ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.


Updated Date - 2021-04-09T05:48:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising