ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటమునిగి టీడీపీ నాయకుడి మృతి

ABN, First Publish Date - 2021-10-18T06:09:04+05:30

మండలంలోని మల్లేపల్లి గ్రామ సమీపంలోని యాడికి కాలువలోని సుడిగుండంలో చిక్కుకొని టీడీపీ నాయకుడు సూర్యనారాయణ యాదవ్‌ (42) మరణించాడు.

సూర్యనారాయణ యాదవ్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




పెద్దవడుగూరు, అక్టోబరు 17 : మండలంలోని మల్లేపల్లి గ్రామ సమీపంలోని యాడికి కాలువలోని సుడిగుండంలో చిక్కుకొని టీడీపీ నాయకుడు సూర్యనారాయణ యాదవ్‌ (42) మరణించాడు. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం  సూర్యనారాయణయాదవ్‌ తన పొట్టేళ్లను కాలువలో శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు సుడిగుండంలో చిక్కుకొని మృతిచెందాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, పదిరోజుల క్రితం ఇదే కాలువలో బందార్లపల్లె గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి మృతిచెందాడు. ఇప్పటికైనా ప్రజలకు ఈ ప్రమాదాలపై అధికారులు సరైన అవగాహన కల్పించాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.


 


యల్లనూరు మండలంలో బాలుడు ...

యల్లనూరు: మండలంలోని లక్షుంపల్లి గ్రామ సమీపంలో కార్తీక్‌ (14) చిత్రావతినదిలో  మృతిచెందాడు. ధర్మవరానికి చెందిన విజయభాస్కర్‌ కుటుంబసభ్యులతో పెద్దస్వామి దర్శనానికి లక్షుంపల్లికి ఆదివారం వచ్చాడు. గుడి సమీపంలోని నదిలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు అతని కుమారుడు కార్తీక్‌ కిందపడి నీటి ప్రవాహానికి  కొట్టుకుపోయారు. గాలించి.. అతన్ని వెలికి తీయగా.. అప్పటికే మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు దూ రం కావడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.


Updated Date - 2021-10-18T06:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising