ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతను నట్టేట ముంచిన ‘వైసీపీ’

ABN, First Publish Date - 2021-11-21T06:00:29+05:30

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడేళ్ల కాలంలో అన్నదాతలను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీటమునిగిన పంట పొలాలను పరిశీలించిన కాలవ.. పార్టీలకు అతీతంగా 

నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ 

బొమ్మనహాళ్‌/డీ హీరేహాళ్‌, నవంబరు 20: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడేళ్ల కాలంలో అన్నదాతలను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. శనివారం బొమ్మనహాళ్‌, డీహీరేహాళ్‌ మండలాల్లోని ఉప్పరహాళ్‌, ఉద్దేహాళ్‌, రంగాపురం క్యాంపు, తిమ్మలాపురం, నాగలాపురం గ్రామాల్లో తుఫాన కారణంగా కురిసిన వర్షాలకు వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి, మిరప, తదితర నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. వర్షానికి పంటలు నీట ము నిగి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని బాధిత రైతులు ఆయన వద్ద వాపోయారు. పంట పొలాలను, నష్టపోయిన వారిని గుర్తించడానికి ఏ ఒక్క అధికారి, నాయకులు గానీ రాలేదని నాగలాపురం రైతు నా గప్ప అన్నారు. అనంతరం కాలవ మాట్లాడు తూ.. జిల్లాలోని 55 మండలాల్లో రూ. వెయ్యి కోట్లకు పైగా పంటనష్టం జరిగితే అధికారులు కేవలం రూ. 116 కోట్లు మాత్రమే నష్టం జరిగిందని అంచనా వేయడం విడ్డూరంగా ఉందన్నారు.  వైసీపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా అంచనా వేసిందని విమర్శించారు.  బాధిత రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన చేతులు రావడం లేదన్నారు. 50 ఇళ్లకు వాలంటరీ, సచివాలయ ఉద్యోగులు ఎ క్కడికి పోయారని, ఉత్తుత్తి అంచనాలతో రైతులను మభ్యపెడుతున్నారని అన్నారు.  శని, ఆది వారాలు శాసనసభకు సెలవులు ఉన్నా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు రాలేదని విమర్శించారు. రైతుల నుంచి కమీషన్లు రావు కాబట్టే వారి వద్దరు రారని,  కమీషన్లు ఇచ్చే వారి వద్దకే  కాపు రామచంద్రారెడ్డి వెళ్తారని మండిపడ్డారు. వరి, పత్తి పంటలకు రూ. 40 వేలు, మిర్చి పంటకు రూ. 50 వేలు నష్టపరిహారం చెల్లించాలని, తూతూ మంత్రంగా అంచనా వేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పార్టీలకతీతంగా నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట మండల కన్వీనర్లు బలరామిరెడ్డి, హనుమంతరెడ్డి, టీడీపీ నాయకులు పయ్యావుల మోహన, గోరంట్ల వెంకటేశులు, యర్రగుంట్ల వెంకటేశులు, కావలి రాము, సంగప్ప, గంగాధర, మల్లికార్జున, లారీ చంద్ర, దొడఘట్ట రామాంజినేయులు ఉన్నారు.

Updated Date - 2021-11-21T06:00:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising