ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శింగనమల ద్విసభ్య కమిటీపై వివాదం

ABN, First Publish Date - 2021-09-17T06:50:06+05:30

ద్వి సభ్య కమిటీని నియమించటంపై శింగనమల టీ డీపీలో వివాదం రాజుకుంది. కొంతకాలంగా ని యోజకవర్గ టీడీపీలో గ్రూపులు కొనసాగు తూ వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలవ వద్ద శ్రావణి వర్గం నేతల పంచాయితీ

గందరగోళంతో పోలీసుల రంగప్రవేశం

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 16: ద్వి సభ్య కమిటీని నియమించటంపై శింగనమల టీ డీపీలో వివాదం  రాజుకుంది. కొంతకాలంగా ని యోజకవర్గ టీడీపీలో గ్రూపులు కొనసాగు తూ వస్తున్నాయి. పార్టీ ఇన్‌చార్జ్‌ బండారు శ్రావణి అందరినీ కలుపుపోవడం లేదని ఓ వర్గం ఆరోపిస్తూ వస్తోంది. మరోవర్గం మాత్రం కొందరు కా వాలనే పార్టీని దెబ్బ తీసేందుకు ఇలా చేస్తున్నారని విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఎంపిక కూ డా నిలిచిపోయింది. బుధవారం రాత్రి శింగనమల నియోజకవర్గం పార్టీ కార్యక్రమాలు, కమిటీల ఎం పిక బాధ్యతలను ద్విసభ్య కమిటీగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసా నాయుడు, సీనియర్‌ నేత ముంటిమడుగు కేశవరెడ్డిని నియమించి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ద్విసభ్య కమిటీ ఎంపిక వివాదానికి దారితీసింది. గురువారం శిం గనమల నియోజకవర్గంలో శ్రావణి వర్గం నాయకులు చిదంబర దొర, చిదానంద నాయుడు, ఆదినారాయణ, పెద్దన్నతోపాటు పలువురు కార్యకర్త లు జిల్లా పార్టీ కార్యాలయంలో అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు సమక్షంలో తప్పుబట్టారు. జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో గ్రూపులు ఉ న్నాయని, శింగనమలలో మాత్రమే ద్విసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించడం ఏంటని, ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్‌ కావడం వల్లే కదా అని వాదనకు దిగారు. కొంద రు ఎస్సీ నియోజకవర్గంలో ఓసీలకు బాధ్యతలు కట్టుబెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడటంతో అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు సైతం ఒకింత అసహనం వ్యక్తం చే శారు. 40 వేల ఓట్లకుపైగా తేడాతో ఓడిపోయాం. అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలని అధినేత ఆలోచిస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకు మనం కట్టుబడి మరింత బాధ్యతగా కలిసి పనిచేయాలని చెప్పుకొచ్చారు. అయినా కొం దరు ద్విసభ్య కమిటీని రద్దు చేసి బండారు శ్రావణికే బాధ్యతలు అప్పగించాలని లేదంటే పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. దీంతో కాలవ మరింత ఆగ్రహం వ్యక్తం చేయగా ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో గందరగోళం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని గొడవ చేస్తున్న శింగనమల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలను బయటకు పంపించారు. 

      అనంతరం కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ పార్టీ నిర్ణయాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రతి టీడీపీ నేత, కార్యకర్త పనిచేయాల్సి ఉంటుందన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని ఏదైనా ఉంటే అందరూ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందామన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడితే పార్టీ అధిష్టానం చూస్తూ ఊరుకోదని అవసరమైతే అ లాంటి వారిపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.


Updated Date - 2021-09-17T06:50:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising