ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా పదవులు, గౌరవానికి సత్యసాయి ఆశీస్సులే కారణం: NV Ramana

ABN, First Publish Date - 2021-11-22T17:08:40+05:30

ఈనాటి నా పదవులు, గౌరవానికి సత్యసాయి ఆశీస్సులే కారణమని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ‘‘ఈనాటి నా పదవులు, గౌరవానికి సత్యసాయి ఆశీస్సులే కారణం’’ అని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. పుట్టపర్తిలో సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవ వేడుకలలో ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 32 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు.  అనంతరం ఎన్వీ రమణ మాట్లాడుతూ పతాకాలు అందుకున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మిగిలిన వర్సిటీలతో పోలిస్తే సత్యసాయి వర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. విద్యార్థులపై సత్యసాయి వాత్సల్యానికి ప్రతీక ఈ వర్సిటీ అని అన్నారు. ఆధునిక గురుకులాలకు ఈ వర్సిటీ ఆదర్శ నామూనా అని తెలిపారు. విలువలతో కూడిన విద్య అందించే దిశగా వర్సిటీలు ఉండాలన్నారు. సత్యసాయి ప్రవచించిన ప్రేమను.. మనం సమాజానికి అందించాలని సూచించారు. నిస్వార్థ సేవా కార్యక్రమాలు నేటి సమాజానికి తక్షణ అవసరమన్నారు. వర్సిటీలో చేర్చుకున్న విద్యా విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలని తెలిపారు. అకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-22T17:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising