ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-12-08T05:47:18+05:30

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 25 వేలు పరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుసంఘం నాయకుల డిమాండ్‌


కదిరిఅర్బన, డిసెంబరు 7: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 25 వేలు పరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ డిమాండ్‌ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం కదిరికి చేరుకుంది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతులకు డ్రిప్పులు, స్ర్పింకర్లు, వ్యవసాయ పనిముట్లలో రాయితీలు కొనసాగించాలన్నారు. ఉపాధి హామీ పథకం పనులు గ్రామాలతోపాటు పట్టణాల్లో కూడా చేపట్టాలన్నారు. ఈ ఏడాది ఖరీ్‌ఫలో రైతులకు అన్ని రకాల బ్యాంక్‌ రుణాలు మాఫీ చేయాలన్నారు. పాడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా లీటరుకు రూ. 4 లు బోనస్‌ ఇవ్వాలన్నారు. మల్బరీ పంటల ప్రోత్సాహకాలను, సబ్సిడీలను కొనసాగించి పెండింగ్‌లో ఉన్న ఇనసెంటీవ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 12 రోజుల పాటు హిందూపురం పార్లమెంట్‌వ్యాప్తంగా పర్యటించి ఈ నెల 18న కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 


Updated Date - 2021-12-08T05:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising