ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్పీ

ABN, First Publish Date - 2021-05-11T05:49:25+05:30

ప్రభుత్వం అమలుచేస్తున్న కరోనా కర్ఫ్యూ ఆంక్షల ను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సత్యయేసుబాబు హెచ్చరించారు.

గుత్తిలో మున్సిపల్‌ కమిషనర్‌తో కలసి కర్ఫ్యూ అమలు తీరును పరిశీలిస్తున్న ఎస్పీ సత్యయేసు బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడిపత్రి, మే 10: ప్రభుత్వం అమలుచేస్తున్న కరోనా కర్ఫ్యూ ఆంక్షల ను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సత్యయేసుబాబు హెచ్చరించారు. సోమవారం ఆయన పట్టణంలో అమలవుతున్న కర్ఫ్యూ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈనెల 18 వర కు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. కర్ఫ్యూ సమయంలో ఆటోలు, ట్యా క్సీలు తదితర వాహనాలను అనుమతి లేదన్నారు. కేవలం అత్యవసర మె డికల్‌ సర్వీసులకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ అనుమతించిన సమయంలో నిత్యావసర వస్తువులను తె చ్చుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా శానిటైజర్‌, మాస్క్‌లు వాడడంతో పాటు భౌతికదూరం పాటించాలన్నారు. ఆయన వెంట డీ ఎస్పీ చైతన్య, పోలీసు అధికారులు ఉన్నారు. 


గుత్తి: ప్రజలు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సత్యయేసు బాబు పేర్కొన్నారు. సోమవారం గుంతకల్లు, క ర్నూలు, తాడిపత్రి రోడ్లల్లో కర్ఫ్యూను ఆయన పర్యవేక్షించారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి అమలు తీరును ఎస్పీకి వివరించారు. ఆయన వెంట   డీఎస్పీ చైతన్య, పామిడి సీఐ రవిశంకర్‌ రెడ్డి, ఎస్‌ఐ గోపాలుడు ఉన్నారు.


పామిడి: పట్టణంలో కర్ఫ్యూ పగడ్బందీగా అమలు చేయాలని ఎస్పీ స త్యయేసు బాబు సూచించారు. ఆయన సోమవారం స్థానికంగా కర్ఫ్యూను పరిశీలించారు. పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి దుస్తుల కోసం పెద్దఎత్తున వ్యాపారులు వస్తుంటారని, ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట తాడిపత్రి డీఎస్పీ చైతన్య, సీఐ శ్యామరావు, ఎస్‌ఐ గంగాధర్‌, పోలీసులు ఉన్నారు.

Updated Date - 2021-05-11T05:49:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising