ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24న చింతపండు కొనుగోలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-01-22T06:05:38+05:30

రాష్ట్రంలో చింతపండు కొనుగోళ్లు మార్కెట్‌గా పేరొందిన హిందూపురం వ్య వసాయ మార్కెట్‌ యార్డులో ఈనెల 24న కొత్త పండు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

హిందూపురంలోని మార్కెట్‌ యార్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ధరలపై రైతుల్లో టెన్షన్‌


హిందూపురం, జనవరి 21: రాష్ట్రంలో చింతపండు కొనుగోళ్లు మార్కెట్‌గా పేరొందిన హిందూపురం వ్య వసాయ మార్కెట్‌ యార్డులో ఈనెల 24న కొత్త పండు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీజన్‌ లో చింతపండు ధరలు ఎలా ఉం టాయో అని అటు వ్యా పారులు ఇటు రైతుల్లో గుబు లు రేపుతుంది. ఏడాది సీజ న్‌లో కరోనాతో మార్కెట్‌ బంద్‌తో తీవ్రంగా నష్టపోయిన చింతరైతులు ఈ ఏడాది సీజన్‌పై ఆశలు పెట్టుకున్నారు. వర్షాలు బాగా కురవడంతో పంట ఆశాజనకంగా ఉండగా కొత్త పం డు ఆదివారం మార్కెట్‌కు రానున్న నేపథ్యంలో ధరల ప్రభావం ఎలా ఉంటుందో టెన్షన్‌ నెలకొంది. ప్రతి ఏ డాది జనవరి మొదటి, రెండో వారంలోనే చింతపండు మార్కెట్‌ ప్రా రంభం చేస్తున్నా ఈసారి మార్కెట్‌లో కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే గత ఏడాది శీత లగిడ్డంగుల్లో నిల్వ ఉన్న పండును ఖాళీకాగా కొత్త పండు రాక కోసం మార్కెటింగ్‌ అధికారులు, ట్రేడర్స్‌ కోసం, కమీషన్‌ ఏజెంట్ల ఎదు రుచూసే పరిస్థితి వచ్చింది. గత ఏడాది జనవరి, ఫిబ్రవరిలో మార్కెట్‌లో మేలిరకం కర్పూలీ క్వింటాల్‌ గరిష్టంగా రూ. 25వేలు పలికి సగటున క్వింటాల్‌ రూ.12 వేల వరకు ధర పలికింది. అదే విఽధంగా మేలిరకం ఫ్లవర్‌ కూడా గరిష్టంగా రూ.18 వేలు, సగటున రూ.9వేలు పలికింది. గత ఏడాది పండు నిల్వలు ఖాళీలతో కొత్తపం డుకు ధరలు ఆశాజనకంగా లభిస్తాయని రైతులు భావి స్తున్నా మహారాష్ట్ర. తెలంగాణతోపాటు కర్ణాటక రాష్ట్రం లోని చిత్రదుర్గ, చెలికెర, తుమకూరు, చింతామణి మా ర్కెట్లకు చింతపండు రాకను బట్టి పురంలో ధరలపై ప్రభావం ఉండవచ్చునని ట్రేడర్స్‌ భావిస్తున్నారు. యార్డులో రైతులకు మౌళిక సదుపాయాలు, సేవలు నామ మాత్రంగా కన్పిస్తున్నాయి. అదే విధంగా రైతు బంధు పథకం అమలు చేయకపోడంతో రైతులు ఉత్పత్తులపై రుణం పొందలేక గిట్టుబాటు ధరలేకున్నా వచ్చిన కాటికి విక్రయించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా యార్డులో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.


ఏర్పాట్లు పూర్తి చేశాం : నారాయణమూర్తి, కార్యదర్శి, మార్కెట్‌ యార్డు


వ్యవసాయ మార్కెట్‌లో ఈనెల 24న చింతపండు కొ నుగోళ్లు ప్రారంభిస్తున్నాం. మార్కెట్‌ల్లో విక్రయాలు, కొ నుగోళ్లు వచ్చే రైతులు, వ్యాపారులకు అవసరమైన అ న్ని వసతులు, ఏర్పాట్లు చేశాం. పండును తీసుకువచ్చే ప్రతి రైతులుకు మార్కెట్లో గిట్టుబాటు ధరల లభిం చేలా చర్యలు తీసుకుంటాం.

 

Updated Date - 2021-01-22T06:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising