ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకా వేయించుకోమని ఇంటింటికీ తిరిగిన సిబ్బంది

ABN, First Publish Date - 2021-07-27T06:12:50+05:30

కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో వింత నాటకం సాగుతూనే ఉంది. ఆసక్తి ఉన్న వారు కేంద్రాలకు వస్తే నిబంధనలు చెప్పి వెనక్కు పంపి స్తున్నారు.

18 ఏళ్ళ పైబడిన వారూ రండి టీకా వేస్తామంటూ పంపిన మెసేజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



18 ఏళ్లు దాటినోళ్లందరికీ టీకా వేస్తామని పిలుపు

అధికారులు మాత్రం 45 ఏళ్లు దాటినోళ్లకే అంటూ ఆదేశాలు

లక్ష్య సాధన కోసం క్షేత్ర స్థాయిలో 

నిబంధనలు పాటించని సిబ్బంది 

 మెగా వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో గందరగోళం

అంతపురం వైద్యం, జూలై 26: కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో వింత నాటకం సాగుతూనే ఉంది. ఆసక్తి ఉన్న వారు కేంద్రాలకు వస్తే నిబంధనలు చెప్పి వెనక్కు పంపి స్తున్నారు. అయితే సోమవారం తలపెట్టిన మెగా వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో ఉన్నతాధికారుల ఆదేశాలు ఒక రకంగా ఉండగా, క్షేత్ర స్థాయిలో సిబ్బంది మాత్రం లక్ష్యం కోసం వాటిని పక్కకు పెట్టేశారు. చివరకు గ్రూప్‌లలో ప్లీజ్‌... కమ్‌ 18 ఏళ్లు దాటినోళ్లందరికీ టీకా వేస్తాం రండీ అంటూ సమాచారం పంపిస్తూ బతిమలాడి టీకా లక్ష్యం సాధనకు  తంటాలు పడ్డారు. 

ఈ పరిస్థితి సోమవారం జిల్లాలో చోటుచేసుకుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఒకేరోజు పెద్ద ఎత్తున పంపిణీ చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ముందుగా వచ్చిన 27వేలు డోసులతో పాటు ఆదివారం జిల్లాకు సర ఫరా అయినా లక్ష డోసుల కొవిషీల్డ్‌ టీకాతో కలిపి మొత్తం 1.27 లక్షల డోసులు వేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. సో మవారం ఈ ప్రక్రియను జిల్లా అధికారులు ప్రతిష్టాత్మ కంగా తీసుకొని మొత్తం 125 కేంద్రాల్లో టీకా పంపిణీ సా గించారు. అయితే 45 ఏళ్లు పైబడిన వారికి, తొలి డోసు వేసుకొని 84 రోజులు దాటిన వారికి, వయసు నిబంధన లేకుండా ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు, టీచర్లకు, ఫ్రం ట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లక్ష్య సాధనకు క్షేత్ర స్థా యిలో అధికారులు, సిబ్బంది నానా తంటాలు పడ్డారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు టీకాను పూర్తి చేసేందుకు  సిబ్బంది ఇంటింటికి పరుగులు తీశారు. అం గన్‌వాడీ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇంటింటికి తిరిగి టీకా వేస్తున్నాం రండి అంటూ బతిమాలాల్సి వచ్చింది. రాత్రి తొమ్మిది గంటలైనా టీకా ఎంత మందికి వేశారో పూర్తి సమాచారా న్ని అధికారులు ప్రకటించలేకపోయారు. డీఎంహెచ్‌ఓ, డీఐఓలను అడిగితే మాత్రం ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ జరుగు తోంది వంద శాతం లక్ష్యం అయిందని సమాధానం చెప్పా రు. మొత్తం మీద మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ అంతా మాయగా సాగింది.


Updated Date - 2021-07-27T06:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising