ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనాల కోసం ఆస్పత్రిలో కార్మికుల ఆందోళన

ABN, First Publish Date - 2021-11-28T05:28:23+05:30

పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలను వెంటనే చెల్లించాలం టూ జిల్లా ఆస్పత్రిలోని పారిశుధ్య కార్మికులు, సె క్యూరిటీ గార్డులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం నవంబరు 27: పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలను వెంటనే చెల్లించాలం టూ జిల్లా ఆస్పత్రిలోని పారిశుధ్య కార్మికులు, సె క్యూరిటీ గార్డులు డిమాండ్‌ చేశారు. శనివారం  ఈ మేరకు వారు ఆస్పత్రి ఓపీ వద్ద ఏఐటీయూసీ నాయకులు రాజారెడ్డి, రాజే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో రెండు గంటలపాటు బైఠాయించి, ఆందోళన చేపట్టారు. చివరకు సూపరింటెండెంట్‌ జగన్నాథం వా రి వద్దకు వచ్చి, వారి సమస్యలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. జీతా లు ఇవ్వకపోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్నారు. నెలలుగా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి, సేవలు అందించిన తమకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలనీ, లేకుంటే సామూహిక సెలవులో వెళ్లిపోతామని హెచ్చరించారు. సూపరింటెండెంట్‌ స్పందించి వేతనాలు వెంటనే వేయిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికు లు శాంతించి, ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు కృష్ణుడు, యూ నియన నేతలు శోభ, రామాంజనేయులు, రామమోహన, శివ, మంజుల, గంగన్న, వన్నూర్‌, నాగరాజ్‌, కార్మికులు పాల్గొన్నారు.




Updated Date - 2021-11-28T05:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising