ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధిక్కారమే.. !

ABN, First Publish Date - 2021-10-19T06:45:11+05:30

ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో సచివాలయాలు నిర్వహించవద్దు. నూతన భవనాలు నిర్మాణాలు చేపట్టొద్దు అంటూ హైకోర్టు ఆదేశించినా ఇక్కడ అధికారులు పట్టించుకోలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికార దర్పంతో పాఠశాలలోనే సచివాలయాల నిర్వహణ

పిల్లల చదువులకు తీవ్ర అంతరాయం

గతేడాదితో పోల్చితే భారీగా తగ్గిన అడ్మిషన్లు

హైకోర్టు ఆదేశించినా మారరా? మేడాపురం గ్రామస్థుల విస్మయం


చెన్నేకొత్తపల్లి, అక్టోబరు 18: ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో సచివాలయాలు నిర్వహించవద్దు. నూతన భవనాలు నిర్మాణాలు చేపట్టొద్దు అంటూ హైకోర్టు ఆదేశించినా ఇక్కడ అధికారులు పట్టించుకోలేదు. పాఠశాలకు సంబంధించిన తరగతి గదిలోనే ప్రస్తుతం సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దీని వల్ల ఆ పాఠశాలలో పిల్లల చదువుకు తీవ్రమైన అంతరాయం కల్గుతోంది. ఇక్కడి నుంచి సచివాలయాలను తరలించాలని పలుమార్లు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు విన్నవిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడంలేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. మండలంలోని మేడాపురం ప్రాథమిక పాఠశాలలో 156 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండేళ్లుగా పంచాయతీకి సంబంధించిన రెండు గ్రామ సచివాలయాలు, ఒక రైతు భరోసా కేంద్రాన్ని పాఠశాల ఆవరణలోని తరగతి గదిలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. దీని వల్ల పిల్లలకు గదుల కొరతే కాకుండా చదువుకు తీవ్ర అంతరాయం జరుగుతోంది. దీంతో పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య కూడా బాగా తగ్గినట్టు ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. గత ఏడాది 70 వరకు అడ్మిషన్లు కాగా ఈ విద్యాసంవత్సరంలో 11 మాత్రమే అడ్మిషన్లు వచ్చినట్టు ఆ వర్గాలు తెలిపాయి.  మేడాపురం మేజర్‌ గ్రామపంచాయతీ కావడంతో 1, 2 సచివాలయాలతోపాటు రైతు భరోసా కేంద్రం అక్కడే ఉండటంతో ప్రజలు నిత్యం పెద్ద ఎత్తున వివిధ పనుల కోసం తరలి వస్తున్నారు. దీంతో పాఠశాల ఆవరణం ఎప్పుడూ రద్దీగా,  గందరగోళంగా ఉంటోందని ఇక పిల్లలకు ఉపాధ్యాయు లు చదువు ఎలా చెబుతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపైన ఇప్పటికే అధికారులు ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా అదిగోఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. దీనికితోడు ఆవరణలోనే  నూతన సచివాలయ భవన నిర్మాణాన్ని కూడా చేపట్టారు. ఈనేపథ్యంలో 1912 సంవత్సరంలో ఏర్పాటైన చరిత్ర ఉన్న పాఠశాల మనుగడ కొందరి స్వార్థపూరిత విధానాల వల్ల ప్రశ్నార్థకంగా మారుతోందన్న ఆందోళనను పలువురు గ్రామస్థులు వ్యక్తం చేశారు.


సచివాలయాలను మార్చుతామని చెప్పి పట్టించుకోలేదు: వెంకటరామిరెడ్డి, హెచఎం

సచివాలయాలు ఉండటం వల్ల పాఠశాల నిర్వహణకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడి నుంచి కార్యాలయాలను తరలించాలని పలుమార్లు ఇక్కడున్న సిబ్బందిని కోరాం. సచివాలయ పంచాయతీ కార్యదర్శి గత నెలలో పది రోజుల్లో తమ కార్యాలయాలు మార్చుతామని మాకు లిఖత పూర్వకంగా తెలియజేశారు. ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోలేదు. 

Updated Date - 2021-10-19T06:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising